మమ్మల్ని ఎంతో టార్చర్ చేశారు: అమలాపాల్
హీరో ధనుష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అతనితో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది అమలాపాల్
మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలాపాల్ తమిళంలో జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం వీఐపీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న వీఐపీ 2 చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.
హీరో ధనుష్ తనకు చాలా మంచి స్నేహితుడని, అతనితో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని నటి అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది. లేనిపోని వదంతులతో తనను, ధనుష్ ను టార్చర్ చేశారని తెలిపింది. ధనుష్ తో నటిస్తే తనకు మంచి అనుభవం వస్తుందని, ఆయన చాలా హార్డ్ వర్కర్ అని చెప్పింది. నటనలో ధనష్ తో తనకు మంచి పోటీ ఉంటుందని తెలిపింది.

నిజంలేని ప్రచారానికి నిలకడ ఉండదు. ఎంత వేగంగా వచ్చాయే అంతగా గాలిలో కలిసి పోతాయి. నిజం చెప్పాలంటే గాయనీ సుచిత్ర నాకు మంచి స్నేహితురాలు. తను నేను కలిసి యోగా చేశాం. సుచిత్ర భర్త కార్తీక్‌కుమార్‌తో కలిసి నేను దైవతిరుమగళ్ చిత్రంలో నటించాను.అలాంటి అనూహ్యంగా నాపై వదంతులు ప్రచారం అయ్యాయి.
ఆరా తీస్తే సుచీ లీక్స్ విషయంలో సుచిత్రకు సంబంధం లేదని తెలిసింది. ఎవరో ఆమె పేరును మిస్ యూజ్ చేశారు. ఈ విషయంలో నన్ను,నటుడు ధనుష్‌ను చాలా టార్చర్‌కు గురి చేశారు. మా గురించి ఏదో వీడియో వస్తుందని అన్నారు. అది ఇంకా ప్రసారం కాలేదని చాలా బాధగా ఉంది. అంటూ చెప్పింది.


Click it and Unblock the Notifications











