శ్రీదేవికి క్యాన్సర్, హైపర్ థైరాయిడిజం.. ఎంతవరకు నిజం, దుబాయ్‌కి వెళ్లే ముందు భర్తతో!

అతిలోక సుందరి శ్రీదేవి మరణం యావత్ భారతాన్ని శోకంలో ముంచేసింది. అందం అభినయంతో సినీప్రేమికులని మెస్మరైజ్ చేసిన ప్రతిభ శ్రీదేవిది. నిన్నటివరకు నిత్య యవ్వనంతో కనిపించిన శ్రీదేవి అనూహ్యంగా మరణించడంతో ఆమెకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది. ఐదు పదుల వయసులో కూడా చలాకీగా ఉన్న శ్రీదేవి ఇలా ఊహించని విధంగా మరణించడంతో అంతా షాక్ కి గురయ్యారు.

అతిలోక సుందరి అనూహ్యంగా

అతిలోక సుందరి అనూహ్యంగా

సినీవినీలాకాశంలో నటీమణిగా శ్రీదేవి సాధించని ఘనత లేదు. ఆమె అందానికి అతిలోక సుందరి అని పేరుపెట్టేసారు. అభినయానికి అంతా మంత్రముగ్దులయ్యారు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో శ్రీదేవి స్టార్‌గా కొనసాగింది. అలాంటి నటి అనూహ్యంగా మరణించడంతో సినీ ప్రపంచం షాక్ కి గురైంది.

నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా

నిత్య యవ్వనంగా, ఆరోగ్యంగా

శ్రీదేవిని గమనించిన వారంతా చిన్ననాటినుంచి ఆమెకు ఇటివంటి ఆరోగ్య సమస్య లేదని, శ్రీదేవి ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆమె ఊహించని విధంగా మరణించడం శ్రీదేవి ఆరోగ్యంపై చర్చ జరిగేలా చేస్తోంది.

క్యాన్సర్ అంటూ పుకార్లు

క్యాన్సర్ అంటూ పుకార్లు

2010,11 సంవత్సర మధ్య కాలంలో శ్రీదేవి క్యాన్సర్ బారీన పడ్డారని పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శ్రీదేవి సన్నిహితులు ఆ పుకార్లని కొట్టిపారేశారు. దీనితో అప్పట్లో శ్రీదేవి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

సంతోషంగా గడుపుతున్న సమయంలో

సంతోషంగా గడుపుతున్న సమయంలో

దుబాయ్ లోని తన మేనల్లుడి వివాహానికి హాజరైన శ్రీదేవి అక్కడ సంతోషంగా గడుపుతూ ఉన్నపళంగా గుండె పోటు రావడంతో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

శ్రీదేవికి హైపర్ థైరాయిడిజం

శ్రీదేవికి హైపర్ థైరాయిడిజం

శ్రీదేవికి కొంతకాలంగా హైపర్ థైరాయిడిజం అనే వ్యాధితో భాదపడుతున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులు దీనిగురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు.

దుబాయ్‌కి వెళ్లేముందు భర్త, కుమార్తె ఖుషితో

దుబాయ్‌కి వెళ్లేముందు భర్త, కుమార్తె ఖుషితో

శ్రీదేవి దుబాయ్‌కి వెళ్లేముందు భర్త బోని కపూర్, కుమార్తె ఖుషితో ముంబై విమానాశ్రయంలో కనిపించిన ఫోటో ఇది. ఈ ఫోటోలు కూడా శ్రీదేవి హుషారుగానే కనిపిస్తోంది.

జాన్వీ కపూర్ వెళ్ళలేదు

జాన్వీ కపూర్ వెళ్ళలేదు

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కుటుంబ సభ్యులతో కలసి దుబాయ్ వెళ్ళలేదు. జాన్వి తన తొలి చిత్రం దడక్ షూటింగ్ కారణంగా ఇక్కడే ఉండిపోయింది. తల్లి మరణ వార్త తెలియగానే ఏడ్చుకుంటూ అధేరిలోని తన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇతర కుటుంబ సభ్యులు జాన్విని ఓదారుస్తున్నారు.

చివరి వరకు కుమార్తెల కోసమే

చివరి వరకు కుమార్తెల కోసమే

శ్రీదేవి వివాహ జీవితంలోకి అడుగుపెట్టాక తన కుమార్తెలే జీవితంగా బ్రతికింది. తన కుమార్తెలు జాన్వీ, ఖుషిని హీరోయిన్లుగా చూడాలని ఆశ పడింది. జాన్వీ నటిస్తున్న తొలి చిత్రం చూడకుండానే శ్రీదేవి మరణించడం విషాదకరం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X