చిరంజీవి, కొరటాల మూవీపై భయకంరమైన రూమర్.. ఖండించిన మెగా ఫ్యామిలీ
ఖైదీ నంబర్ 150 చిత్రంతో టాలీవుడ్ రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం సైరా నర్సింహారెడ్డి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నది. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు మీడియాలో వార్తలు రావడంపై చిత్ర యూనిట్లు సంయుక్తంగా స్పందించాయి. అధికారికంగా ఓ ప్రకటనను మీడియాకు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

సినిమా ఆలస్యంతో రూమర్లు
దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను రూపొందిస్తున్నది. సినిమా పనులు అనుకొన్న మేరకు పూర్తికాకపోవడంతో కొంత ఆలస్యమైంది. దాంతో ఈ సినిమాపై రూమర్లు వస్తున్నాయి. మేము వాటిని ఖండిస్తున్నాను అని తెలిపారు.

చిరంజీవి లాక్ చేశారు.. త్వరలోనే
కొరటాల, చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే సినిమా స్క్రిప్టును చిరంజీవి లాక్ చేశారు. అందులో ఎలాంటి మార్పులు లేవు. త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్తాం అని యూనిట్ సభ్యులు ప్రకటనలో తెలిపారు.

సైరా మూవీతో మెగాస్టార్ బిజీగా
ప్రస్తుతం చిరంజీవి గారు సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

నా కోసం వస్తే మెగాస్టార్ దొరికారని
కొరటాల శివ, చిరంజీవి సినిమా గురించి ఇటీవల ఇంటర్వ్యూలో రాంచరణ్ మాట్లాడుతూ.. వాస్తవానికి నాతో కొరటాల శివ సినిమా చేయాల్సింది. కానీ అనుకోకుండా చిరంజీవి గారితో ప్రాజెక్ట్ సెట్ అయింది. నా కోసం వస్తే కొరటాలకు బంపర్ ఆఫర్‌గా మెగాస్టార్ దొరికారు. మా సినిమా తర్వాత చేస్తాం అని అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చిరంజీవి సినిమా
సైరా తర్వాత కొరటాల శివతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోను చిరంజీవి నటించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తారు. ఈ విషయాన్ని వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో స్వయంగా చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











