రామ్ చరణ్ రూ. 17 కోట్లు: పవన్, మహేష్‌ వెనక్కి!

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెమ్యూనరేషన్ విషయంలో ఇక నెం.1 స్థానానికి చేరుకోబోతున్నారు. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మాత్రమే టాప్‌లో ఉండే వారు. వీరు ఓక్కో సినిమాకు దాదాపు రూ. 15 కోట్లు తీసుకుంటున్నారని టాక్.

తాజాగా రామ్ చరణ్‌కు రూ. 17 కోట్ల ఆఫర్ ఇచ్చాడొక క్రేజీ నిర్మాత. రామ్ చరణ్ అతనితో సినిమా చేయడానికి ఇప్పటికే ఓకే చెప్పేసాడు. అతను ఎవరో కాదు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ హిట్ల బాటలో దూసుకెలుతున్న బండ్ల గణేష్. ఆయన త్వరలో రామ్ చరణ్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం మే 2వ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరో వారం లో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X