రజనీకాంత్‌ ’పేట్ట’కు టాలీవుడ్ షాక్.. రిలీజ్‌పై రూమర్లు.. ఆ వార్తను నమ్మొద్దు: సీ కల్యాణ్

టాలీవుడ్‌లో తమిళ సూపర్‌స్టార్లు రజనీకాంత్, అజిత్‌ కుమార్ మంచి మార్కెట్ ఉందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రజనీ, అజిత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకులకు పండుగే. అయితే ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు పేట్ట, విశ్వాసం చిత్రాలతో సంక్రాంతి బరిలో దిగారు. కానీ ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కావడం లేదు. అందుకు థియేటర్ల సమస్యే ప్రధాన కారణమని తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి పండుగ బరిలో

సంక్రాంతి పండుగ బరిలో

ప్రతీ ఏడాది మాదిరిగానే తెలుగులో భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్, రాంచరణ్ చిత్రం వినయ విధేయ రామ, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చే F2 చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్ ఓనర్లు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నారట.

 రజనీ, అజిత్ సినిమాలపై అనాసక్తి

రజనీ, అజిత్ సినిమాలపై అనాసక్తి

తెలుగు డిస్టిబ్యూటర్లు రజనీకాంత్, అజిత్ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో పేట్ట, విశ్వాసం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య పేట్ట సినిమాను నిర్మాత సీ కల్యాణ్ రిలీజ్ చేస్తున్నాడనే వార్తలు టాలీవుడ్‌లో సంచలనం రేపాయి. దాంతో సీ కల్యాణ్ స్పందించారు.

పేట్ట రైట్స్ తీసుకోలేదు

పేట్ట రైట్స్ తీసుకోలేదు

సూపర్ స్టార్ రజినీకాంత్ గారి 'పేట్ట' చిత్రం తెలుగు హక్కులు నేను తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం రైట్స్ కి నాకు ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను.

రజనీకాంత్ అంటే గౌరవం

రజనీకాంత్ అంటే గౌరవం

సూపర్ స్టార్ రజినీకాంత్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి నేను ఎలాంటి చర్చలూ జరపలేదు." అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ స్పష్టం చేశారు. 'పేట్ట' చిత్రం రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్ని నిర్మాత కల్యాణ్ ఖండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X