Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలే?: చెర్రీ-ఎన్టీఆర్ కాంబోను జక్కన్న ఎలా చెక్కుతున్నాడో తెలుసా!
ఆ ఒక్క ఫోటో.. జక్కన్న డైరెక్షన్లో చెర్రీ-ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేయబోతున్నారన్న ఊహాగానాలకు ఊతమిచ్చింది. అటువైపు నుంచి 'నో' అన్న సమాధానమేది రాకపోవడంతో.. ఇక ఈ కాంబినేషన్ పక్కా అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. నిజంగా ఈ మల్టీస్టారర్ ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ.. దీనికి సంబంధించి మరో ఆసక్తికర ఊహాగానం తెర పైకి వచ్చింది.
Recommended Video
పోలీస్ పాత్రల్లో..:
ఎన్టీఆర్-చెర్రీ కాంబినేషన్ లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలో ఈ ఇద్దరు హీరోలు పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారట. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో సబ్-ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.
విక్రమార్కుడు తర్వాత..:
విక్రమార్కుడు తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలను టచ్ చేయని రాజమౌళి.. మరోసారి పవర్ఫుల్ కాప్ పాత్రలను తీర్చిదిద్దబోతున్నారట.
అయితే ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా కావడంతో.. ఇద్దరి పాత్రలు బ్యాలెన్స్ అయ్యేలా స్క్రిప్టు రాసుకుంటున్నారట. విక్రమార్కుడులో రవితేజను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో ఇప్పుడు అంతకన్నా పవర్‌ఫుల్‌గా వీరిద్దరిని చూపించబోతున్నాడని టాక్.
రాంచరణ్‌కు కలిసిరాలేదు..:
గతంలో 'తుఫాన్' సినిమాలో చేసిన పోలీస్ పాత్ర రాంచరణ్‌కు ఏమాత్రం కలిసిరాలేదు. సరికదా!.. రాంచరణ్ నటనపై చాలా విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ఎన్టీఆర్‌ను మాత్రం అప్పటిదాకా ఉన్న ఫ్లాప్స్ నుంచి పోలీస్ పాత్రే గట్టెక్కించింది.
'టెంపర్'లో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. పోలీస్ పాత్రలో విఫలమైన రాంచరణ్, అదే పాత్రతో హిట్ ట్రాక్ ఎక్కిన ఎన్టీఆర్ లను జక్కన్న మరోసారి పోలీస్ పాత్రల్లో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడోనన్న చర్చ ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఎందుకు రివీల్ చేయట్లేదు:
ఎన్టీఆర్-చెర్రీ సినిమా గురించి హింట్ మాత్రమే ఇచ్చిన జక్కన్న.. అధికారికంగా సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. నిజంగా ఈ సినిమా పట్టాలెక్కుతుందా? అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.
ఇకపోతే 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు' అన్న ప్రశ్నతో జనాల్లో విపరీతమైన క్యురియాసిటీ పెంచిన జక్కన్న.. మరోసారి అలాంటి మ్యాజిక్ చేయడానికే ఈ సినిమా గురించి కూడా రివీల్ చేయట్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డులు బద్దలవ్వాల్సిందే:
ఎన్టీఆర్-చెర్రీ ఇద్దరినీ పోలీస్ పాత్రల్లో చూపించడం ఖాయమైతే రికార్డులు బద్దలవ్వాల్సిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతోనే గతంలో చాలా సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు తెరపై పోలీస్ పాత్రల్లో కనిపించబోతున్నారంటే ఆ ఇంపాక్ట్ మామూలుగా ఉండదనే చెప్పాలి.