మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ త్వరలో అంటే 2009 లో పెళ్లి చేసుకుంటాడని అన్ని చోట్లా వినిపిస్తోంది.ఫిల్మనగర్ లోనే గాక పబ్ లలో, యూత్ కలసి కబుర్లు చెప్పుకునే కాఫీ హౌస్ లలో, క్లబ్ లలో తరుచుగా ఇదే టాపిక్ నడుస్తోంది.ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలలో ఇది హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమ అల్లుడని కొందరు ఏరియా కూడా స్పెసిఫై చేస్తున్నారు. మామగారు సాప్ట్ వేర్ సంస్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తారని చెపుతున్నారు. ఆయన చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడట. ఇంతకు ముందు చిరుత హీరోయిన్ నేహాశర్మ తో రహస్య వివాహం జరిగిందని రూమర్ వచ్చినపుడు అందరికి తెలియపరిచే చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి విషయం నిజమైతే వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నమాట. వెయిట్ అండ్ సీ!