‘ఉప్పెన’ను చుట్టుముట్టిన రూమర్లు.. వైష్ణవ్ తేజ్ మూవీకి రిలీజ్ కష్టాలు!
మెగా ఫ్యామిలీ నుంచి మరో సినీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రం ద్వారా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే వైష్ణవ్ తేజ్ నటన గురించి సినీ వర్గాలు పాజిటివ్‌గా చెప్పుకోవడం సినిమాకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంపై తాజాగా రూమర్లు చెలరేగుతున్నాయి. అయితే ఆ రూమర్లు ఏమిటంటే..

సినిమాలకు సినీ కష్టాలు
కరోనావైరస్ కారణంగా సినిమా పరిశ్రమకు ఎనలేని కష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే ప్రారంభమైన సినిమా షూటింగ్‌లు మధ్యలోనే ఆగిపోవడం, పూర్తయిన సినిమాలు రిలీజ్‌కు నోచుకోలేకపోవడంతో నిర్మాతలపై ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగింది. దాంతో పలు సినిమాలు థియేటర్ల ముఖాలను చూడకుండానే OTT ఫ్లాట్‌ఫాంలపై రిలీజ్ చేయాలని నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకొంటున్నారు. అయితే నిర్మాతల నిర్ణయాలను పీవీఆర్, ఐనాక్స్ లాంటి థియేటర్ యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఓటీటీ రిలీజ్‌పై చర్చ
అయితే OTT ఫ్లాట్‌ఫాంలపై సినిమాల రిలీజ్ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉప్పెన సినిమాను రూమర్లు చుట్టుముట్టాయి. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకొన్నారని, ఆ క్రమంలోనే ఆ సినిమా హక్కులను పొందడానికి ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయత్నాలు చేపట్టాయనే వార్త సినీ, మీడియా వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

ఓటీటీ రిలీజ్‌పై ఖండన
తాజాగా ఉప్పెన చిత్రంపై వస్తున్న రూమర్లపై యూనిట్ స్పందించింది. ఈ చిత్రం OTTలో రిలీజ్ అవుతున్నదనే విషయాన్ని మూవీ యూనిట్ ఖండించింది. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఓటీటీ రిలీజ్ కేవలం రూమర్ మాత్రమే. ఈ సినిమా ఎప్పుడైనా.. ఎన్నటికైనా థియేటర్‌లోనే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఏ ఎక్కడైనా రిలీజ్ చేస్తాం అని చెప్పారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ అమ్మడం జరిగిందని.. అమెజాన్, ఆహా ప్రయత్నిస్తున్నారనే వార్తలో నిజం లేదు అని చెప్పారు.

మెగా మేనల్లుడు హీరోగా
ఉప్పెన చిత్రం సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు స్వయానా సోదరుడు. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ యాక్టింగ్, లుక్స్, పెర్ఫార్మెన్స్ మంచి పేరు వచ్చింది. కీర్తి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం రిలీజ్ తర్వాత అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటుందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Recommended Video

తెర వెనుక
సాంకేతికవర్గం:
దర్శకత్వం: బుచ్చిబాబు సనా
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, సుకుమార్
ఎడిటింగ్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫి: శ్యామ్ దత్
ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్: రామకృష్ణ, మౌనిక
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్స్: సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్


Click it and Unblock the Notifications











