»   »  ఇది మరో సోషల్ మీడియా మర్దర్... ఆ నటి చనిపోలేదు

ఇది మరో సోషల్ మీడియా మర్దర్... ఆ నటి చనిపోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య బతికి ఉన్నవారిని సోషల్ మీడియాలో చంపేయటం మామూలైపోయింది. ఏదో ఒక గొడవకారణం గా కక్ష సాధిపుకోసం కొందరైతే.., కేవలం ఆటపట్టించి వినోదించటానికి మరికొందరు. ఇలా సోషల్ మీడియా మర్డర్లు చేస్తూనే ఉన్నారు. తాజా గా 'బిగ్ బాస్' షో విన్నర్, ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి మృతి చెందిందంటూ సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వచ్చాయి.

వరుసగా కండోలెన్స్ మెస్సెజ్

వరుసగా కండోలెన్స్ మెస్సెజ్

శ్వేతా భర్త అభినవ్ కి సన్నిహితుల దగ్గరినుంచి వరుసగా కండోలెన్స్ మెస్సెజ్ లూ, ఫోన్ కాల్స్ రావటం మొదలయ్యింది. కంగారు ప‌డిపోయి షూటింగ్ నుంచి కాల్ చేసాడట.., ఆమె లిఫ్ట్ చేయటం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి షూటింగ్ వదిలేసిమరీ ఇంటికి పరుగెత్తాడట... ఇంతకీ ఏం జరిగిందంటే...

ఆమె స్నేహితురాలి నుంచే

ఆమె స్నేహితురాలి నుంచే

అసలు ఎలా మొదలయ్యిందో తెలియదు గానీ ఈ పోస్ట్ మొదట కనిపించింది ఆమె స్నేహితురాలి నుంచే కావటం గమనార్హం. ఈ పోస్టు మొద‌ట‌గా శ్వేత స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్‌ తన ట్విటర్‌ ఖాతాలో చేసిన‌ట్లు తెలుస్తోంది. శ్వేతా స్నేహితురాలు మరియు ప్రముఖ నటి అయినా సాక్షి తన్వర్‌ చేసిన ఒక ట్విట్ ద్వారా ఈ వార్త పుట్టుకొచ్చింది.

సాక్షి తన్వర్‌

సాక్షి తన్వర్‌

సాక్షి తన్వర్‌ తన ట్విట్టర్ లో స్నేహితురాల్ని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది అని ట్విట్ చేసింది. దీనితో ఈ ట్విట్ చూసిన వారందరు శ్వేతా తివారి చనిపోయిందేమో అందుకే సాక్షి తన్వర్‌ ఇలాంటి ట్విట్ చేసిందని అనుకున్నారు. శ్వేతని కోల్పోయినందుకు బాధగా ఉంద‌ని ఆమె తన ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేయ‌డంతో ఆమెకు అభిమానులంతా నివాళులు అర్పిస్తూ 'రెస్ట్ ఇన్ పీస్' అంటూ ట్వీట్లు చేశారు.

తా భర్త అభినవ్‌

తా భర్త అభినవ్‌

అక్కడితో ఆగకుండా మరికొంత మంది సన్నిహితులకు కూడా ఈ వార్త చేరటం తో కొంద‌రు శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి మీ ఆవిడ చ‌నిపోయినందుకు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నామ‌ని అన్నారు. దీంతో షాక్‌కు గురైన‌ అభినవ్ షూటింగ్‌ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లిపోయాడు. త‌న భార్య హ్యాపీగానే ఉంద‌ని అనంత‌రం ఆయన ట్వీట్ చేశాడు. ఇటువంటి పుకార్లు సృష్టించ‌కూడ‌ద‌ని అన్నారు.

శ్వేత తెగ నవ్వుకుందట

శ్వేత తెగ నవ్వుకుందట

ఇంటికి వెళ్లిన అభినవ్‌ ఈ విషయంను శ్వేతకు తెలపడంతో శ్వేత తెగ నవ్వుకుందట. ఇలాంటి వార్తలను, పుకార్లను ఇంకెప్పుడు సృష్టించవద్దని అభినవ్‌ మీడియాను వేడుకున్నాడట. ఈ వార్తపై స్పందించిన శ్వేత కూడా నేను చనిపోయాను అనే వార్త ఇప్పటికి మూడుసార్లు వచ్చిందని, ఇదేమి మొదటి సారి కాదని అన్నారు.

నేను చనిపోలేదు అంటూ

నేను చనిపోలేదు అంటూ

ఇలాంటి వార్తలను వింటుంటే ముందు నవ్వు వస్తుందని, వీటికి నేను అలవాటు పడిపోయ్యానని, నేను చనిపోలేదు అంటూ స్వయంగా చెప్పుకుంది శ్వేతా... అయితే ఇలాంటి పోస్ట్ అసలు సాక్షి ఎందుకు చేసిందన్నది మాత్రం తెలియలేదు... ఇద్దరి మధ్యా గొడవ అవటం తో

స్నేహితురాలిగా కోల్పోయానన్న్న ఉద్దెశ్యం తో

స్నేహితురాలిగా కోల్పోయానన్న్న ఉద్దెశ్యం తో

తనని స్నేహితురాలిగా కోల్పోయానన్న్న ఉద్దెశ్యం తో సాక్షీ పెట్టిన పోస్ట్ ని కొందరు ఆమె చనిపోయిందన్నట్టు అర్థం చేసుకోవటం వల్లే ఈ పొరపాటు జరిగిందని వార్తలు వస్తున్నా..., రిప్ అంటూ వచ్చిన కమెంట్లు చూసాకైనా ఆమె శ్వేతా చనిపోలేదన్న విషయం చెప్పకుండా మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటో మరి...

English summary
Shweta Tiwari appears undeterred by the hoax, saying this is not the first time a celebrity has been subjected to such rumours
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu