రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ యాడ్(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా సుజీత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రన్ రాజా రన్''. ఈ చిత్రం వచ్చే నెల 1న చిత్రం విడుదలవుతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాతలు పేపరు యాడ్ ఇచ్చారు. థియోటర్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. దర్శకుడు సుజీత్ ఇంటర్వూలు కూడా మీడియాలో వచ్చేసాయి. సుజీత్ 'రన్‌ రాజా రన్‌' ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

సుజీత్‌ మాట్లాడుతూ.... ''ఇప్పటివరకు 40 లఘుచిత్రాలు తెరకెక్కించాను. ఆ అనుభవంతోనే ఈ కథను రాసుకొని వంశీ, ప్రమోద్‌లను సంప్రదించాను. ఈ కథ రాయడంలో ఓ గమ్మత్తు ఉంది. నేను చేసిన ఓ లఘుచిత్రం పేరు 'రన్‌ రాజా రన్‌'. ఆ పేరు నచ్చి దానిఆధారంగానే కథ రాసుకున్నాను. సినిమా మొదలు పెట్టాక శర్వానంద్‌కి, సినిమాకి ఈ పేరు సరిగ్గా కుదిరింది. సత్యహరిశ్చంద్రుడు లాంటి కుర్రాడు కథ ఇది. ఎప్పుడూ నిజాలు చెప్పే అలవాటు వల్ల ప్రేమలో విఫలమవుతుంటాడు. ఇదే సమయంలో ఓ నేరంలో ఇరుక్కుంటాడు. దాని నుంచి ఎలా బయటపడ్డాడనేదే సినిమా'' అన్నారు.

అలాగే పాటల గురించి చెప్తూ... ''కమల్‌హాసన్‌తో వరుస సినిమాలు చేస్తున్న జిబ్రాన్‌ ఈ సినిమాకు స్వరాలందించారు. పాటలు విన్నవారందరూ కొత్త తరహాలో ఉన్నాయి అంటున్నారు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది'' అన్నారు సుజీత్‌.

Run Raja Run confirmed for Aug 1

జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి విడుదలైంది. ప్రభాస్ హీరోగా తొలి యత్నంలోనే 'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన యు.వి. క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తమ రెండో చిత్రం కావటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది.

లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రన్ రాజా రన్' రూపొందుతోంది. ఇందులో కథ ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశాలు ఉన్నాయి. కథకు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలో కథకు అవసరమైన పాత్రలే ఉంటాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో దీన్ని నిర్మిస్తున్నారు.

అడివి శేష్, సంపత్, జయప్రకాశ్‌రెడ్డి, వెన్నెల కిశోర్, అలీ, కోట శ్రీనివాసరావు, విద్యుల్లేఖ రామన్, అజయ్ ఘోష్ తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: ఘిబ్రాన్ ఎం., ఛాయాగ్రహణం: మధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X