హాట్ ఆఫర్: సినిమా నచ్చితేనే డబ్బులు ఇవ్వండి
అరవింద్ కృష్ణ, సుప్రియా శైలజ జంటగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రుషి'. ప్రసాద్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎ.రమేష్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం క్రిందటి వారం విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా...వాచ్ అండ్ పే ఆఫర్ ని ఇస్తున్నారు. సినిమా చూసి నచ్చితేనే డబ్బులివ్వండి అనే నినాదంతో రేపు అంటే వాలెంటైన్స్ డే రోజున ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. అయితే ఈ షోలు హైదరాబాద్ వాసులకు మాత్రమే పరిమితం కానున్నాయి.
ప్రసాద్ మల్టిప్లెక్స్ లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఇక మెడిసిన్ ఒక తపస్సు..డాక్టర్ ఒక రుషి అనే నినాదంతో వచ్చిన ఈ 'ఋషి' సినిమా మంచి థీమ్‌తో ఆకట్టుకుంటుంది. రోటీన్ సినిమాలకు భిన్నంగా మంచి అనుభూతిని ఇవ్వడమే కాదు, అర్థవంతమైన ఆలోచనలు రేకెత్తిస్తోంది. మరి ఇప్పటికే చూడనివారు రేపు వాలైంటైన్స్ కానుకగా ప్రసాద్ సంస్ధ ఇస్తున్న ఈ ఆఫర్ ని వినియోగించుకోండి.


Click it and Unblock the Notifications











