»   » భర్తని మోసం చేసి ఇంకొకరితో శృంగారం ... ఇలియానా ఆపాత్ర ఎలా చేసింది?

భర్తని మోసం చేసి ఇంకొకరితో శృంగారం ... ఇలియానా ఆపాత్ర ఎలా చేసింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అతనో నేవీ అధికారి... తన సర్వీస్ లో అత్యంత ప్రతిభా పురస్కారాలని అందుకున్న వ్యక్తి. అందగాడుకూడా... ఒక పార్టీలో చూసిన అందాల రాశిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆమె అతన్ని మోసగించింది... అతని కళ్ళుగప్పి ఇంకొక వ్యక్తితో శ్రుంగారం లో ఉందగా అతని కళ్ల బడింది... ఆవెశం తో రగిలిపోయిన అతడు తన భార్య పక్కలో ఉన్న మనిషిని కాల్చి చంపాడు...

  అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువచ్చారు... అక్కడ బయట పడింది అసలు విశయం అతను హతున్ని చంఫటానికి కార్ణం అతని భార్యతో ఉన్న సంబందం కాదు.... మరో భయంకరమైన కుట్ర... అదేమిటీ??? తెలుసుకోవాలనుకుంటే ఆగస్టు 12 దాకా ఆగాల్సిందే... అక్షయ్ కుమార్ "రుస్తుం" చూడాల్సిందే

  Also Read: 'రుస్తుం' ట్రైలర్ అదిరింది, ఇన్నాళ్లకు మళ్లీ ఇలియానా (వీడియో)

  Rustom: The real story that inspired the Akshay starrer film

  50 ఏళ్ల కిందటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. సినిమాను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దినట్లున్నాడు దర్శకుడు టిను. అక్షయ్ కుమార్ మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి తనదైన ముద్ర వేసినట్లున్నాడు. ఇలియానా పాత్ర సినిమాలో చాలా కీలకంగా కనిపిస్తోంది... ఇక ఈ సినిమా తర్వాత ఇలియానా కోరుకున్నట్టే బాలీవుడ్ లో అవకాశాలు రావొచ్చు కానీ కథ తిరగబడి... సినిమా బోల్తా కొడితే మాత్రం... ఇల్లూ పరిస్థితి అగమ్య గోచరమే...

  బాలీవుడ్లో ఇలియానా ఏడాదిన్నర తర్వాత నటిస్తున్న సినిమా 'రుస్తుమ్'. వైవిధ్యమైన కథలో ప్రయాణం చేస్తూ.. వరుసగా హిట్లు కొడుతూ.. సినిమా సినమాకూ తన రేంజి పెంచుకుంటున్న అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. నిన్ననే "రుస్తుమ్" ట్రైలర్ విడుదలైంది.

  "స్పెషల్ చబ్బీస్", "బేబీ" లాంటి సినిమాల్ని రూపొందించిన దర్శకుడు నీరజ్ పాండే నిర్మాతగా మారి.. టిను సురేష్ దేశాయ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1959లో బాంబే నేపథ్యంలో సాగే ఓ నేవీ అధికారి కథతో 'రుస్తుమ్' తెరకెక్కింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఇండియన్ ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతి పంచబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

  English summary
  Akshay Kumar starrer Rustom is largely inspired from the famous 1959 case of KM Nanavati v. State of Maharashtra that changed the face of the Indian judicial system. The trailer of the movie, produced by Neeraj Pandey, has already created much curiosity among cinema lovers. The movie will hit theatres on August 12.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more