సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు?
శంకర్ నిర్మాణంలో జ్యోతి ఫిలిమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై "సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు" అనే చిత్రం ప్రారంభమైంది. రుతిక, భార్గవ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్, సౌమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని శంకర్ నిర్మిస్తున్నారు. హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హైదరాబాద్ లో ప్రారంభోత్సవం జరుపుకుంది. ముహూర్తపు సన్నివేశానికి అశ్వనీకుమార్ క్లాప్ నివ్వగా మారుతి కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... "ఓ మధ్యతరగతి అమ్మాయి చెందిన కలలు ఎలా ఉంటాయనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. ఆ అమ్మాయి కలలు నిజం చేసుకోవాలంటే ఏం చేసిందనేది ప్రధాన అంశం. విభిన్న కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది ఈ సినిమా కోసం చాలా మంది కొత్త ఆర్టిస్టులను ఎంపిక చేశాం. చాలా మంచి జట్టు దొరికింది. ఒకే షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తాం" అన్నారు.ఈ చిత్రంలో గౌతమ్ సౌమ్య, మెల్కొటి, సుమన్ శెట్టి, గుండు హనుమంతరావు, షకీలా తదితరులు నటిస్తున్నారు.
అంతా బాగానే ఉంది.. కానీ సారీ! మా ఆయన ఇంట్లో ఉన్నాడు అన్న టైటిల్ పెడార్థాన్ని ఇస్తోందని కొందరు అనుకోవడం కనిపించింది. పైకి చెప్పకపోయినా... కొంతమంది "ఏం చేస్తాం.. కలికాలం.. ముందు ముందు ఎటువంటి టైటిళ్లు వినాల్సి వస్తుందో" అని గొణుక్కోవడం కనిపించింది.


Click it and Unblock the Notifications











