'సారీ..మా ఆయన ఇంట్లో ఉన్నాడు' రెడీ
"సారీ... మా ఆయన ఇంట్లో ఉన్నాడు' సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. టైటిలే ఎంతో వెరైటీగా, ఎన్నో అర్ధాలను ఇచ్చేదిగా ఉంది. పైగా ఇందులో అందాలు ఆరబోసే రుతిక హీరోయిన్. అందాలతో పాటు ఆమె అభినయం కూడా గొప్పగా ఉందని నిర్మాత, దర్శకులు మురిసిపోతున్నారు. ఒక అందమైన మధ్యతరగతి యువతి తనకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటుంది. మెట్టినింట అడుగుపెట్టిన అటువంటి యువతి మానసిక స్ధితి ఎలా ఉంటుందో ఈ సినిమాలో తెరకెక్కించారు.
ఈ సినిమాను జ్యోతి ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై శంకర్ నిర్మించారు. మిగితా తారాగణం: భార్గవ్, గౌతం, సౌమ్య, మెల్కోటి, సుమన్ శెట్టి, షకీలా, గుండు హనుమంతరావు. చిన్న సినిమాల సెగ్మెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నందువల్ల ఈ సినిమా పెద్దగా అడే అవకాశాలు లేకపోలేదు. నరేష్ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రాఫర్ కల్యాణ్.


Click it and Unblock the Notifications











