‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నా ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 8 న శిల్పకళా వేదికలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం స్పెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ రెండు పాటలు తీస్తారు. ఒకటి సమంత పైనా, మరొకటి శృతి హాసన్ పైనా సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7న హైదరాబాద్ ఈ చిత్రం యూనిట్ వస్తుంది. వచ్చిన మరుసటి రోజే ఆడియో విడుదల అవుతుంది.
ఇక సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27 విడుదల చేస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవల వెల్లడించారు. "ఈ సినిమా గురించి వస్తున్న రూమర్లను దృష్టిలో పెట్టుకుని గందరగోళాన్ని నివారించడానికి ఈ వివరణ ఇస్తున్నాను. సినిమాను ఇంతకు ముందు చెప్పినట్టు సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తాం. ఇందులో ఏ మార్పూ లేదు. ఏది ఏమైనా ఇది జరిగితీరుతుంది" అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు.
దిల్ రాజు మాట్లాడుతూ- ''ఎన్టీఆర్ ఇమేజ్‌ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే సినిమా అవుతుంది. తన గత చిత్రాలకు ధీటుగా హరీష్‌శంకర్ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే మైసూర్‌లో ఎన్టీఆర్, సమంత, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాం. నేటి నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలైంది. అంచనాలను మించేలా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు. అలాగే... ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.


Click it and Unblock the Notifications












