Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్ఎక్స్ 100: అన్ని ముద్దు సీన్లు చేసినా పాయల్ రెమ్యూనరేషన్ అంతేనా?
కార్తియేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఎక్స్ 100' బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కథ మాత్రమే కాదు... హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లు కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను థియేటర్ల వైపు ఆకర్షిస్తోంది. సినిమాలో లెక్కలేనన్ని ముద్దు సీన్లు ఉండటంతో హీరోయిన్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే ఆమె ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిసి అంతా షాకవుతున్నారు.
ముందు హీరోయిన్ దొరకడమే కష్టం అయిందట
'ఆర్ ఎక్స్ 100' సినిమాలో బోల్డ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు లెక్కలేనన్ని ఉండటంతో ఈ సినిమాలో చేయడానికి చాలా మంది హీరోయిన్లు నో చెప్పారట. అసలు హీరోయిన్ దొరకడమే కష్టం అనుకున్న సమయంలో పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందట.
రెమ్యూనరేషన్ ఎంతంటే?
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆర్ఎక్స్ 100' సినిమా ద్వారా పాయల్ రాజ్ పుత్ అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం రూ. 6 లక్షలేనంట. ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని పాయల్ ఈ రేంజిలో రొమాన్స్ పండించడం హాట్ టాపిక్ అయింది.
టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోకి రావాలనే...
అయితే సినిమా కథ బాగా నచ్చడంతో పాటు...ఈ సినిమా చేస్తే తనకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉండటం, టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చే ఉద్దేశ్యంతోనే ఆమె రెమ్యూనరేషన్ తక్కువైనా చేయడానికి ఒప్పుకుందట.
రెమ్యూనరేషన్ పెంచడం ఖాయం
ఆర్ఎక్స్ 100 సినిమా విడుదలైన తొలి రోజు నుండే హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లకి వెళ్లింది. మరో వైపు పాయల్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయట. తర్వాత చేయబోయే సినిమాలకు మాత్రం పాయల్ తన రెమ్యూనరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.