»   » రష్మి తొడలు, సముద్రం చూసి... నిర్మొహమాటంగా చెప్పిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్

రష్మి తొడలు, సముద్రం చూసి... నిర్మొహమాటంగా చెప్పిన ఆర్ఎక్స్ 100 డైరెక్టర్

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  RX 100 Director Ajay Bhupathi Sensational Comments On Anchor Rashmi

  జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అంతకు మించి'. యూ అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో ఎస్.జై. ఫిలిమ్స్ పతాకంపై సతీష్, ఎ.పద్మనాభరెడ్డి నిర్మించారు. జానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి గెస్ట్ హాజరై సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ రష్మి అందంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  రష్మి తొడలు చూసి అంతా మరిచిపోయా

  రష్మి తొడలు చూసి అంతా మరిచిపోయా

  ఇటీవలే ‘అంతకుమించి' ట్రైలర్ చూశాను. అందులో నాకు బాగా నచ్చింది రొమాంటిక్ షాట్స్. అవంటే నాకు చాలా ఇష్టం. గతంలో మేము ఫిలింనగర్ ఛాంబర్ దగ్గర ‘ఆర్ఎక్స్ 100' హోర్డింగ్ వేశాం. మా హోర్డింగ్ పక్కన చాలా రోజులు ఏ హోర్డింగ్స్ పెట్టలేదు. సడెన్‌గా ఒక హోర్డింగ్ వచ్చింది. రష్మిగారి తొడలు, సముద్రం బీచ్‌తో కూడి ఆ హోర్డింగ్ చూస్తే నా సినిమా హోర్డింగ్ గురించి మరిచిపోయాను. ఇది నేను ఒక ఆడియన్‌గా చెబుతున్నాను. రేపు మీరు కూడా నాలాగే కనెక్ట్ అవుతారు.... అంటూ అజయ్ భూపతి వ్యాఖ్యానించారు.

   రొమాంటిక్ షాట్స్ అనేవి సినిమాలో ఒక భాగం

  రొమాంటిక్ షాట్స్ అనేవి సినిమాలో ఒక భాగం

  ఆగస్టు 24న సినిమా విడుదలవుతోంది. అందరూ తప్పకుండా చూడాలి. రొమాంటిక్ షాట్స్ అనేవి సినిమాలో భాగం. నా సినిమాలో అయినా ‘అంతకుమించి' సినిమాలో అయినా కేవలం అవి ఉంటే సినిమా హిట్ అయిపోదు. అంతకుమించి కంటెంట్ ఉండాలి, స్టోరీ స్ట్రాంగ్‌గా ఉన్నపుడే సినిమాలు ఆడతాయి... అని అజయ్ భూపతి అన్నారు.

  ఇలాంటి సినిమాలు చేయడం కష్టం

  ఇలాంటి సినిమాలు చేయడం కష్టం

  ‘హారర్, థ్రిల్లర్ శైలి చిత్రాలు తీయడం అన్నింటికంటే చాలా కష్టం. ఈ చిత్రాల్లో సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే సినిమాకి ప్లస్ అవుతుంది. అదే ‘అంతకు మించి' సినిమాలో కనపడుతోంది. ఈ చిత్ర హీరో, నిర్మాత జై నాకు మంచి మిత్రుడు. మొదటిసారిగా తను చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నా... అన్నారు.

  రష్మి సినిమాకు హైలెట్

  రష్మి సినిమాకు హైలెట్

  దర్శకుడు జానీ మాట్లాడుతూ.. ‘రష్మి చాలా బాగా నటించారు. తనే ఈ సినిమాకు హైలెట్. హీరో జై కొత్తవాడు అయినా ఎక్కడా ఆ ఫీల్ కలగదు. అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. మ్యూజిక్, కెమెరా పనితనం బాగుంటే సినిమా చాలా బాగా వస్తుంది. ఈ సినిమాకు ఆ రెండు బాగా కుదిరాయి అన్నారు.

  అంతా రాత్రి వేళల్లోనే: రష్మి

  అంతా రాత్రి వేళల్లోనే: రష్మి

  హీరోయిన్ రష్మి మాట్లాడుతూ.. ‘అందరి కష్టం ఈ సినిమా. చాలా ఎంజాయ్ చేసి కష్టపడి పని చేసాం. నిర్మాతల ముఖాల్లో నవ్వు కనపడితే తృప్తిగా ఉంటుంది. అదే ఈ చిత్ర నిర్మాతల్లో నేను చూశాను. హీరో కమ్ ప్రొడ్యూసర్ జై మంచి నటుడే కాదు.. మంచి టెక్నికల్ నాలెడ్జి కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఎక్కువగా రాత్రి వేళల్లో చిత్రీకరించాం. ఇందులో నేను డూప్ లేకుండా స్టంట్స్ కూడా చేశాను. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.

  English summary
  RX 100 Director Ajay Bhupathi sensational comments on Anchor Rashmi Thighs Anthaku Minchi movie press meet. He said that no other film’s hoarding was kept besides RX 100 movie hoarding at Filmnagar for several days and expressed that he loved the thigh poster of Rashmi Gautham in Anthaku Minchi hoarding which is set up besides RX 100 movie hoarding.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more