Mangalavaram Trailer Review: కొరడా దెబ్బలు.. పాయల్ అరుపులు.. మెంటల్ ఎక్కిస్తున్న 'మంగళవారం'

ఆర్ఎక్స్ 100... టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరంలేదు. అప్పటి వరకు సినిమాలు ఓ కోవాలో వెళ్తుండగా.. ఈ సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి ట్రెండ్ సెట్టర్ గా మారిపోయాడు. ఇక ఆయన దర్శకత్వంలో మరో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అయింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం సినిమా ట్రైలర్ శనివారం రిలీజ్ అయింది. మరి ఆ ట్రైలర్ కథేంటి.. ఈ మంగళవారం గోలేంటి.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అజయ్ భూపతి.. దర్శకుడిగా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆర్ఎక్స్ 100 సినిమా తీసి.. కలెక్షన్ల వర్షంతో పాటు.. అమ్మాయిలు ఇలా కూడా ఉంటారు అని సోసైటీకి బోల్డ్ గా చెప్పేశాడు. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ దర్శకుడు. ఇక ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు కూడా అంతే ఫేమస్ అయిపోయారు. ఇక ఈ దర్శకుడు ఆ తర్వాత తీసిన మహా సముద్రం మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.

RX 100 Director Ajay Bhupathi Heroine Payal Rajput Mangalavaram Movie Trailer Review Full Details Here

ఇప్పుడు మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు అజయ్ భూపతి వచ్చేస్తున్నాడు. మంగళవారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. తనకు ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ ఇచ్చిన అదే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను ప్రధాన పాత్రలో పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్. ఇక ఈ సారి బొమ్మ అదిరిపోతుందని ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, పాటలు చూస్తేనే అర్థం అయింది. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై అంఛనాలు రెట్టింపు అయ్యాయి.

RX 100 Director Ajay Bhupathi Heroine Payal Rajput Mangalavaram Movie Trailer Review Full Details Here

ఇక మంగళవారం ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు మేకర్స్. మంగళవారం ట్రైలర్ ఓపెన్ అవ్వగానే... ఒక ఊరిలో గ్రామదేవతకి ఇష్టమైన మంగళవారం రోజునే హత్యలు జరగుతుంటాయి. ఇక గోడలపై అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులపై పేర్లు.. ఆ గోడలపై రాస్తున్నదెవరు... ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి... ఎవరు చేస్తున్నారు.. అనే ఆసక్తిక విషయాలను తెలియజేస్తూ ట్రైలర్ సాగుతోంది.

RX 100 Director Ajay Bhupathi Heroine Payal Rajput Mangalavaram Movie Trailer Review Full Details Here

ఇక ట్రైలర్ చివర్లో పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఎంట్రీ.. బెడ్ సీన్స్... ఆమెను కోరడాతో కొట్టడం... మధ్యలో బీజీఎం.. దానికి తోడు పాయల్ అరుపులు... ట్రైలర్ చూస్తుంటే మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది. ఇక చివర్లో పాయల్ ఓ టబ్ లో బట్టలు లేకుండా కూర్చొవడం ప్రేక్షకులకు షాక్ ని ఇస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. ఇదేక్కడి ట్రైలర్ రా బాబు అనిపించేలా ఉంటుంది.

ఇక మంగళవారం సినిమా విషయానికి వస్తే.... పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించగా... అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X