వర్మ నీచుడు.. కళ్లకు క్లిప్పులు పెట్టి.. ఆ సినిమాలు చూపించాలి.. కిడ్నాప్ చేసి.. RX100 డైరెక్టర్ ఫైర్

By Rajababu

Recommended Video

Director Ajay Bhupathi Comments On Ram Gopal Varma

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ శిష్యుడిగా అజయ్ భూపతి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆయన రూపొందించిన RX 100 చిత్రం ఘన విజయం సాధించింది. భారీస్ఠాయిలో రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. బూతు సినిమా అని ప్రచారం జరిగినా అలాంటి వాదనను ఎదురించి ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి మీడియాతో మాట్లాడుతూ.. వర్మ నీచుడు అని కామెంట్ చేశాడు. ఇంకా అజయ్ భూపతి ఏమన్నారంటే..

సూసైడ్ చేసుకోవాలన్నది

సూసైడ్ చేసుకోవాలన్నది

ఐదేళ్ల క్రితం ఓ సంఘటన వల్ల చాలా మానసిక వేదనకు గురయ్యాను. ఆత్మహత్య చేసుకోవాలన్నది వాస్తవం కాదు. ఐదేళ్ల క్రితం అనుభవించిన బాధ ఇక రాదు. ఇక ముందు బాధపడను. ఓ మహాత్ముడు నీ బాధను క్యాష్ చేసుకోమని సలహా ఇచ్చాడు. అప్పుడు నా వద్ద ఉన్న కథలను పక్కన పెట్టి ఆర్‌ఎక్స్ RX 100 సినిమా కథ రాశాను దర్శకుడు అజయ్ భూపతి పేర్కొన్నారు.

అవే RX 100లో ప్రస్తావించా

అవే RX 100లో ప్రస్తావించా

నా జీవితంలో చూసిన, విన్న సంఘటనలు, సమాజంలో జరిగిన విషయాలను RX 100లో రాసుకొన్నాను. నేను ప్రేమలో విఫలమయ్యాక మానసిక వేదనకు గురయ్యాను. నా ప్రేమ విఫలమయ్యాక.. నేను గొప్పగా ప్రేమించే అమ్మాయి దొరికితే బాగుండని అనుకొంటే.. అలాంటి అమ్మాయి లభించింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని అజయ్ భూపతి తెలిపారు.

ముద్దులు చాలా కామన్

ముద్దులు చాలా కామన్

ముద్దులు పెట్టుకోవడం, మందు తాగడం, సిగరెట్ తాగడం లాంటి అంశాలు నేటి సమాజంలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కామన్. నేటివిటి సినిమాను తీస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమే బూతు సినిమా అని ప్రచారం చేస్తున్నారు అని అజయ్ అన్నారు.

వర్మను మించిన దర్శకుడు లేరు

వర్మను మించిన దర్శకుడు లేరు

డైరెక్టర్ రాంగోపాల్ వర్మను మించిన టెక్నిషియన్ దేశంలోనే లేరు. ఆయన మించిన దర్శకుడు లేడు. వ్యక్తిగతంగా ఆయన మించిన నీచుడు ఎవరూ లేరు. అవతలి వ్యక్తులను కెలకడం, కామెంట్ చేయడం నాకు నచ్చదు. అందుకే నీచుడు అని అన్నాను.

 వర్మను కిడ్నాప్ చేయాలి

వర్మను కిడ్నాప్ చేయాలి

ఇతరులపై కామెంట్లు చేయడం నాకు నచ్చదు. ఎదుటి వారిని కెలికినప్పుడు వర్మను కిడ్నాప్ చేయాలి. కాళ్లు, చేతులు కట్టేయాలి. కుర్చీకి కట్టేసి.. కళ్లు రెప్పలు వార్చకుండా క్లిప్పులు పెట్టేసి ఫ్యామిలీ సినిమాలు చూయించాలి. అదే ఆయనకు అలాంటి శిక్ష విధించాలి. కాకపోతే డైరెక్టర్‌గా ఆయన నాకు దేవుడు అని అన్నారు.

తీస్తే వర్మ బయోపిక్..

తీస్తే వర్మ బయోపిక్..

ఒకవేళ బయోపిక్ సినిమా తీస్తే అది రాంగోపాల్ వర్మ జీవిత కథను తెరకెక్కిస్తాను. వర్మ నీచమైన జీవితం.. డైరెక్టర్‌గా ఆయన గొప్పతనం అన్నీ అందులో ఉంటాయి అని అజయ్ భూపతి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X