ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి వివాహం
'ఆర్ఎక్స్ 100' సినిమా దర్శకుడు అజయ్ భూపతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆత్రేయపురంకు చెందిన లక్ష్మీ శిరీష అనే అమ్మాయిని అజయ్ పెళ్లాడబోతున్నాడు. కొంతకాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఆగస్టు 25న హైదరాబాద్ శామీర్ పేటలోని రాగి కన్వెన్షన్ హాల్ వీరి వివాహానికి వేధిక కానుంది. వీరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తోంది.
దర్శకుడు కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన అజయ్ భూపతి... వీరూ పోట్ల, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పని చేశాడు. సహాయ దర్శకుడిగా పని చేస్తూ తనలోని క్రియేటివిటీకి మరింత పదును పెట్టుకున్నారు.

వర్మ వద్ద శిష్యరికం చేసిన అనంతరం సొంతగా 'ఆర్ఎక్స్ 100' కథ రాసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్నాడు. తొలి సినిమా చేసే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడో? ఏమో కానీ...మొత్తానికి సంసార జీవితంలోకి అడుగు పెడుతున్నాడు.
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్ఎక్స్ 100 మూవీ సైతం అజయ్ భూపతి, లక్ష్మి శిరీష సొంతూరైన ఆత్రేయపురం, పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించడం గమనార్హం. ఈ సినిమా విజయం అనంతరం అజయ్ భూపతికి వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీకెండ్ జరిగే వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











