ఇంటివాడైన RX 100 దర్శకుడు.. హాజరైన సినీ ప్రముఖులు.. ప్రత్యేక ఆకర్షణగా పాయల్!
Recommended Video

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఓ ఇంటి వాడయ్యాడు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని ఓ కల్యాణ వేదిక వద్ద శనివారం రాత్రి లక్ష్మీ శిరీషతో అజయ్ వివాహం జరిగింది. ఈ పెళ్లికి సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

హాజరైన సినీ ప్రముఖులు
అజయ్ భూపతి పెళ్లికి హాజరైన వారిలో హీరో రామ్, నితిన్, కార్తీకేయ, నటుడు రావు రమేష్, నిర్మాత సుధాకర్ రెడ్డి, స్రవంతి మూవీస్ అధినేత కిశోర్, భవ్య సిమెంట్స్ అధినేత, నిర్మాత వెనిగళ్ల ఆనంద ప్రసాద్, నిర్మాత అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా RX 100 టీమ్
అజయ్ పెళ్లికి RX 100 చిత్ర హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తీకేయ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. RX 100 చిత్రానికి పనిచేసిన చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో వచ్చి అజయ్ దంపతులను ఆశీర్వదించారు.

వర్మ శిష్యుడిగా
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడైన అజయ్ తన మొదటి చిత్రం RX 100తో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకొన్న సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా రూపొందిన RX 100 సుమారు 25 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

మరిన్నీ ఫోటోల కోసం
అజయ్ భూపతి పెళ్లికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం కింది లింక్ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications











