బోయపాటి శిష్యుడితో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ న్యూ మూవీ షురూ.. (ఫోటోస్)

Recommended Video

RX 100 Fame Karthikeya New Movie Launched

'ఆర్‌‌ఎక్స్‌100 ' సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకోవడంతో పాటు మంచి గుర్తింపు తెచ్చుకన్న కార్తికేయ హీరోగా మరో చిత్రం ప్రారంభం అయింది. కొత్త దర్శకుడు అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ పతాకంపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గురువారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో జరిగిన ప్రారంభోత్సవానికి దర్శకుడు బోయపాటి శ్రీను, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి క్లాప్ కొట్టగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్‌ చేశారు.

ఎస్పీ బాలు మాట్లాడుతూ

ఎస్పీ బాలు మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ‘ అనిల్‌ కడియాల, ప్రవీణ కడియాల జంట నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటినుండో సుపరిచితులు. నేను ఏ సినిమా ఓపెనింగ్‌లకు వెళ్లను. అటువంటిది ఆ జంట ఎంతో కష్టపడి ఇంతదూరం ప్రయాణం చేశారు. వారి ప్రయాణంలోని మొదటి సినిమా ఓపెనింగ్‌కు వచ్చి వాళ్లను మనసారా ఆశీర్వదించటం నా బాధ్యత అనిపించింది. వారితో పాటు మరో నిర్మాత తిరుమల్‌ రెడ్డి, దర్శకుడు అర్జున్‌ జంధ్యాలకు అల్‌ ది బెస్ట్‌' అన్నారు.

 అర్జున్‌ నాకు తమ్ముడు లాంటివాడు: బోయపాటి

అర్జున్‌ నాకు తమ్ముడు లాంటివాడు: బోయపాటి

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘ నా దగ్గర పన్నెండు సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా ప్రయాణం చేసిన అర్జున్‌ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్‌ ఉన్నవాడతను. అలాగే ఈ నిర్మాతలు నాకు మొదటినుండి మంచి మిత్రులు. హీరోకి ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుందని కచ్చితంగా చెప్పగలను' అన్నారు.

ఆర్ఎక్స్ 100 విన్న తర్వాత బెస్ట్ స్టోరీ

ఆర్ఎక్స్ 100 విన్న తర్వాత బెస్ట్ స్టోరీ

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌‌ఎక్స్‌ 100' చిత్రం విడుదల తర్వాత నేను చాలా కథలు విన్నాను. నేను విన్న అన్ని కథల్లోకి బెస్ట్‌ కథ ఇది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడేప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అన్నారు.

ఆయన పేరు తగ్గకుండా సినిమా తీస్తా

ఆయన పేరు తగ్గకుండా సినిమా తీస్తా

దర్శకుడు అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ ‘నా గురువు, సోదరుడు ఆల్‌‌ ఇన్‌ వన్‌ అంతా బోయపాటిగారే. ఆయన పేరు ఎక్కడా తగ్గకుండా సినిమా తీస్తానని ప్రామిస్‌ చేస్తున్నాను. ఈ సినిమా ఇంత తొందరగా స్టార్ట్‌ అయ్యిందంటే దానికి కారణం హీరో కార్తికేయనే. ఆయన నేను కథ చెప్పగానే కథ మీద ఉన్న నమ్మకంతో ఎంతో ఎంకరేజ్‌ చేసి ముందు మన సినిమా చేద్దాం అని చెప్పారు. నా నిర్మాతలు నన్ను నమ్మి నేను అడిగిన ప్రతి టెక్నీషియన్‌ను నా కిచ్చి ప్రోత్సహిస్తున్నారు. అందరూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌' అన్నారు.

కథను నమ్మి వచ్చాము

కథను నమ్మి వచ్చాము

నిర్మాత అనిల్‌ కడియాల మాట్లాడుతూ... ‘ సినిమా యూనిట్‌ను ఆశీర్వదంచటానికి వచ్చిన బోయపాటి గారికి, బాలు గారికి థ్యాంక్స్‌. ఈ కథపై ఉన్న నమ్మకంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాము. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. హీరో కార్తికేయకు ఇది లైఫ్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది' అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డివివి. దానయ్య, మిరియాల రవీంధర్‌ రెడ్డి, ప్రవీణ్, నటులు హేమా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరధ్వాజ్, కెమరామెన్‌ :‘ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్‌ ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X