RX 100 హీరో రెండో సినిమా కన్ఫర్మ్.. నిర్మాత, దర్శకుడు ఎవరో తెలుసా?
RX 100 చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యువ హీరో కార్తీకేయ మరో చిత్రంపై దృష్టి సారించాడు. ఓ వైపు తన మొదటి చిత్రం ఓ వైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగానే.. తన తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన రెండో చిత్రాన్ని ఏకంగా తమిళ దర్శకుడితో చేయడం చర్చనీయాంశమైంది. తన రెండో సినిమా గురించి కార్తీకేయ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

టీఎన్ కృష్ణతో రెండో సినిమా
నా రెండో బిగ్ ప్రాజెక్ట్‌కు పునాది పడింది. నాకు ఇష్టమైన నువ్వు నేను ప్రేమ చిత్రాన్ని రూపొందించిన టీఎన్ కృష్ణతో సినిమా చేయబోతున్నాను. నేను నటించిన RX100 సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. నా నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.

కృష్ణ చెప్పిన కథ అమేజింగ్
దర్శకుడు టీఎన్ కృష్ణ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి నాకు కథ చెప్పాడు. తను చెప్పిన కథ అమేజింగ్‌గా ఉంది. కథ విన్న తర్వాత పిచ్చెక్కిపోయింది. ఆ సినిమా కథ విన్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా ఉన్నాను.
నిర్మాతగా కలైపులి థాను
నా రెండో సినిమాకు లెజెండరీ నిర్మాత కలైపులి థాను నిర్మాతగా మారడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన వీసీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతున్నది. ఆర్డీ రాజశేఖర్ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. భగవంతుడి దయవల్లే ఇదంతా సాధ్యమవుతున్నది అని కార్తీకేయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దూసుకెళ్తున్న RX 100
RX100 చిత్రం నాలుగు వారాలు పూర్తి చేసుకొని ఐదోవారంలోకి ప్రవేశించింది. ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు సమాచారం. త్వరలోనే భారీ ఎత్తున్న సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ జరుపుకోనున్నది.


Click it and Unblock the Notifications











