ఆసక్తి రేపుతున్న ‘ఆర్ఎక్స్ 100’... అంచనాలు పెంచిన ట్రైలర్!
Recommended Video

'ఆర్ఎక్స్ 100' ఈ పేరు వినగానే మనకు ఒకప్పుడు యూత్ ఫేరెట్ బైక్ గుర్తుకు వస్తుంది. ఇపుడు ఇదే టైటిల్‌తో సినిమా రాబోతోంది. కేసీడబ్ల్యూ బ్యానర్‌పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఆర్ఎక్స్ 100 చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఫస్ట్ రైడ్ పేరుతో విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇన్ క్రెడిబుల్ లవ్ స్టోరి అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. కార్తికేయ, పాయల్ రాజపుత్ హీరోహీరోయిన్లు. రావురమేష్, సింధూర పువ్వు రామ్‌కీ ఇందులో కీలక పాత్రధారులు. అజయ్ భూపతి గతంలో రామ్ గోపాల్ వర్మ వద్ద పలు సినిమాలకు పని చేశారు.

ట్రైలర్ అదిరిపోయింది
‘ఆర్ఎక్స్ 100' ట్రైలర్ చూసిన తర్వాత..... సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రియలిస్టిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. లవ్, యాక్షన్, రొమాన్స్ అన్ని కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అదిరిపోయే యాక్షన్
లవ్ స్టోరీకి... సరైన ఎమోషన్స్ జోడించి యాక్షన్ పార్ట్ డిజైన్ చేస్తే.... సినిమా చూసే ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ పెరుగుతుంది. దర్శకుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

కిర్రెక్కించే రొమాంటిక్ సీన్లు
ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయనున్నాయి. కిర్రెక్కించే ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాలు యూత్‌కు మంచి కిక్ ఇవ్వడం ఖాయంగా కనపిస్తోంది.

సినిమా గురించి దర్శక నిర్మాతలు
సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ఓ చిన్న టౌన్ నేపథ్యంలో కథ నడుస్తుంది. రియలిస్టిక్ లవ్ స్టోరీ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అన్నారు. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ మా చిత్రానికి కథే హైలైట్. కథకు తగ్గ విధంగా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించాం. సినిమా చూసిన వారందరూ నిర్మాణ విలువలను మెచ్చుకుంటారు. అన్నీ హంగులున్న చక్కటి కమర్షియల్ చిత్రమిది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం. నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్. కే.ఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం అని తెలిపారు.
ఆర్‌ఎక్స్ 100
నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజపుత్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్ తదితరులు.సాంకేతిక వర్గం: మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ ,లిరిక్స్: శ్రీమణి , చైతన్య ప్రసాద్, సిరాశ్రీ, కొరియోగ్రఫీ:స్వర్ణ, అజయ్, సురేష్ వర్మ, స్టంట్స్: రియల్ సతీష్ , ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి, ఎడిటర్: ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ ), సినిమాటోగ్రఫీ: రామ్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, ఎగ్జిక్యూటివ్: సూర్య నారాయణ, నిర్మాత: అశోక్ రెడ్డి గుమ్మకొండ , రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.


Click it and Unblock the Notifications











