సినిమా నీచంగా అనిపిస్తే నన్ను కొట్టండి.... హీరో సంచలన వ్యాఖ్యలు!
కేసీడబ్ల్యూ బ్యానర్‌పై కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్‌ఎక్స్ 100'. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావురమేష్, సింధూర పువ్వు రాంకీ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఆడియో వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో కూడా మాట్లాడటానికి ధైర్యం చేయని కామెంట్స్ అతడి నుండి వినిపించాయి.
Recommended Video


మా వెనక ఎవరూ లేరు
ఆర్ఎక్స్ 100... ఈ సినిమా మొదలైనపుడు పేరున్న హీరోకానీ, డైరెక్టర్ కానీ, బాగా పాపులర్ అయిన బ్యానర్ కానీ లేదు. వీరిలో ఏ ఒక్కటి ఉన్నా కాస్త పబ్లిసిటీ పెరిగి జనాల్లో దీని గురించిన బజ్ క్రియేట్ అవుతుంది. మా మూవీలో టీంలో ఉన్న ఎవరికి ఇండస్ట్రీలో పెద్ద వాళ్లతో పరిచయాలు కూడా పెద్దగా లేవు. ఆ రోజు మేము ఇవేవీ లేవని ఆలోచించలేదు, కంటెంటును నమ్ముకుని మేము చేయగలం అనే ధైర్యంతో సినిమా పూర్తి చూశాం. పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ క్రమక్రమంగా సినిమాకు రెస్పాన్స్ పెరుగుతూ వచ్చింది... అని కార్తికేయ తెలిపారు.

వారెవరూ అవసరం లేదు
సినిమా ట్రైలర్ విడుదల తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అపుడు అనిపించింది కావాల్సింది ఇండస్ట్రీలో పరిచయాలు, సినిమాలో బిగ్ పర్సనాలిటీస్ కాదని, ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించడానికే సినిమాలో పేరున్న పర్సనాలిటీస్ కావాలి. కానీ మాకు డైరెక్ట్‌గా ఆడియన్సే వస్తున్నపుడు వారంతా అవసరం లేదు. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదలు పెట్టినపుడు మాలో కాన్ఫిడెన్స్ ఎంత ఉందో, దానికి వెయ్యి శాతం ఎక్కువగా ఇపుడు ఉందని కార్తికేయ అన్నారు.

సినిమా నచ్చకపోతే డబ్బు తిరిగి ఇచ్చేస్తా..
సినిమా మీరు చూశాక మీరు పెట్టిన 100 రూపాయలు వేస్ట్ అయినట్లు అనిపిస్తే జులై 14 రోజు మళ్లీ ఇక్కడే వచ్చి నిల్చుంటాను. నీ సినిమా వల్ల మా డబ్బు వృధా అయింది అని ఎవరైతే అంటారో వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని కార్తికేయ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమా నీచంగా అనిపిస్తే నన్ను కొట్టండి
‘ఆర్‌ఎక్స్ 100' ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుందా? అని కొందు సందేహ పడుతున్నారు. ఎవరూ సందేహ పడాల్సిన అవసరం లేదు. అమ్మ, నాన్న, అక్క, చెల్లితో చూసే సినిమా ఇది. సినిమా నీచంగా ఉందని మీ అమ్మగానీ ఎవరైనా కొడితే..... నన్ను కొట్టమని పంపించండి అని కార్తికేయ వ్యాఖ్యానించాడు.

రెండు రోజులు సినిమా హ్యాంగోవర్ ఉంటుంది
సినిమా అయిపోయే సమయానికి మీ మమ్మీ, మీ డాడీ కంటి నిండా నీళ్లతో గుండెలు బరువెక్కడం ఖాయం. కనీసం రెండు రోజుల వరకు ఈ సినిమా హ్యాంగోవర్ దిగదు. తర్వత ఒక మంచి సినిమాకు తీసుకొచ్చావు వారే మీతో చెబుతారు అని... కార్తికేయ అన్నారు.

ఆ డబుల్ మీనింగులు, ఎక్స్ ఫోజింగ్ ఓకేనా...
చాలా వరకు ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా పాటల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, లిరిక్స్ ఉంటాయి. ఎక్స్ ఫోజింగ్ సీన్లు ఉంటున్నాయి. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. జన్యూన్‌గా ఒక ఎమోషన్, ఒక పెయిన్ చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా ఉంటుందని అనుకోను. మీ మైండ్ నుండి ఆ డౌటే తీసేయండి... అని కార్తికేయ తెలిపారు.


Click it and Unblock the Notifications











