RX 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తండ్రి మృతి.. కారణం ఏంటంటే?
తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పాయల్ రాజ్ పుత్. వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉన్నారామె. అయితే తాజాగా ఆ హీరోయిన్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పాయల్ రాజ్ పుత్ తండ్రి భయంకరమైన వ్యాధికి గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. దీంతో పాయల్ రాజ్ పుత్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తోటీ నటీనటులు కూడా ఆమెకు సోషల్ వీడియో వేదికన ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మిగితా వివరాల్లోకి వెళితే..
రాజ్ పుత్ పాయల్ కుటుంబ వివరాలు..
పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో పుట్టి పెరిగింది. 1992 డిసెంబర్ 5 జన్మించింది. ఆమె తండ్రి విమయ్ కుమార్ రాజ్ పుత్. ఆయన ఒక టీచర్ గా పని చేస్తూ ఉండే వారు. ఇక పాయల్ రాజ్ పుత్ తల్లి పేరు నిర్మల్ రాజ్ పుత్. ఆమెకు ఒక తమ్ముడు ధృవ్ రాజ్ పుత్ కూడా ఉన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా పలు సందర్భాల్లో కుటుంబం గురించి వివరిస్తూనే వస్తోంది. ఆమె ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది పాయల్ రాజ్ పుత్ మాత్రమేనని తెలుస్తోంది.

పాయల్ తండ్రి మరణం..
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తండ్రి మరణ వార్తను ఆమె అభిమానులు జీర్ణించుకో లేకపోతున్నారు. పాయల్ తన తండ్రి మీద ఉన్న ప్రేమను వర్ణించడంతో భావోద్వేగం అవుతున్నారు. పాయల్ తండ్రి మరణ వార్తను ప్రకటించడంతో నటి లక్ష్మి రాయ్ స్పందించింది. నీ తండ్రి ఎల్లప్పుడూ నీతో ఉంటాడని ప్రార్థిస్తున్నాను. నీకు, నీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని స్పందించింది.
ఇక పాయల్ రాజ్ పుత్ తండ్రి విమయ్ కుమార్ రాజ్ పుత్ జూలై 28న హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో అదే రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు 68 ఏళ్లు. ఇక వారి స్వస్థలం ఢిల్లీ కావడతంతో ఈరోజు జూలై 30న అక్కడ అంత్య క్రియలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మరణంతో పాయల్ శోక సంద్రంలో మునిగిపోయింది. తన తండ్రిపై ఉన్న ప్రేమను వర్ణించింది. నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న అంటూ పోస్ట్ పెట్టింది.
ఇదే సమయంలో తన తండ్రి మరణానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. తండ్రి భయంకరమైన క్యాన్సర్ భారీన పడి మృతి చెందారని పేర్కొంది. తన తండ్రిని కాపాడుకునేందుకు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేదని బాధపడింది. ఇక పాయల్ రాజ్ పుత్ RX 100 చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తొలిచిత్రంతోనే భారీ సక్సెస్ ను అందుకుంది. వెంకీ మామ, మంగళవారం వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











