RX100 బైక్ చూపించి.. హై క్లాస్ కారును ఎత్తికెళ్లిన డైరెక్టర్.. గేదేలు కాసుకొంటానని..

By Rajababu

Recommended Video

RX100 Movie 25 Days Celebrations Meet

RX100 చిత్రం ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకొన్నది. ప్రేక్షకులు, సినీ విమర్శకుల అంచనాలను తారుమారు చేసి ఘన విజయం సొంతం చేసుకొన్నది. కొత్త హీరో, హీరోయిన్లు పాయల్, కార్తీకేయ, నూతన దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన RX100 చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 25 రోజుల వేడుకను నిర్వహించారు.

బోల్డ్ డైలాగ్స్‌తో హీరో కామెంట్స్

బోల్డ్ డైలాగ్స్‌తో హీరో కామెంట్స్

సినిమా ప్రమోషన్‌లో భాగంగా బోల్డ్ డైలాగ్‌లతో హీరో కార్తీకేయ అదరగొట్టేశాడు. సినిమా బాగా లేకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. ప్రేమించలేని వాళ్లు ఈ సినిమాను అసలు చూడొద్దు అంటూ హీరో కార్తీకేయ సెన్సేషనల్ కామెంట్స్ చేయడం కొంత అతిగా అనిపించింది.

ఏ మాత్రం తగ్గని డైరెక్టర్

ఏ మాత్రం తగ్గని డైరెక్టర్

ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఇది నేటివిటి సినిమా. ఇంటెన్సివ్ లవ్‌స్టోరి. ఎవరూ ఊహించనటువంటి చిత్రం ఇది. ఈ సినిమా ఆడకపోతే నేను ఇంటికెల్లి గేదేలు కాసుకొంటానని బోల్డ్ డైలాగ్స్‌తో అజయ్ ఇరుగదీశాడు. అందరూ ఏమిటీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకొన్నారు.

కార్తీకేయ, పాయల్ కెమిస్ట్రీ

కార్తీకేయ, పాయల్ కెమిస్ట్రీ

సినిమా విడుదలైన తర్వాత సినీ విమర్శకులు పెదవి విరిచారు. కానీ కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ జోడి కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాయి. దాంతో 25 రోజులపాటు కనకవర్షం కురిపించింది. హీరో, డైరెక్టర్ల

నిర్మాతకు కనకవర్షం

నిర్మాతకు కనకవర్షం

RX100 చిత్రం సుమారు 5 కోట్ల రూపాయలతో తెరకెక్కింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. నిర్మాత అశోక్ రెడ్డి కనకవర్షంలో తడిముద్దయ్యాడు

డైరెక్టర్‌ అజయ్‌కి భారీ గిఫ్ట్

డైరెక్టర్‌ అజయ్‌కి భారీ గిఫ్ట్

తనకు అద్భుతమైన విజయాన్ని అందించిన అజయ్ భూపతికి నిర్మాత అశోక్ రెడ్డి మంచి గిఫ్ట్‌ను అందజేశారు. అజయ్ భూపతికి హైఎండ్ జీప్ కంపెనీ కారును బహుమతిగా అందజేశారట. దాంతో తెర మీద RX100 బైక్‌ను చూపించిన డైరెక్టర్.. ఏకంగా కారును పట్టుకెళ్లిపోవడం ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేసింది. తొలి చిత్ర దర్శకుడికి హిట్టంటే అలా ఉండాలి అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X