‘ఆర్ఎక్స్ 100’ గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?
Recommended Video

కొన్ని రోజులుగా 'ఆర్‌ఎక్స్ 100' సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ ఇద్దరూ కొత్తవారే, దర్శకుడు అజయ్ భూపతికి ఇది తొలి సినిమా అయినప్పటికీ కేవలం ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా గురించి భారీ బజ్ ఏర్పడింది. సినిమా ప్రమోషన్స్ సైతం గ్రాండ్‌గా నిర్వహించడం కూడా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడటానికి కారణం అయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? వారి దృష్టిలో సినిమాలో బాగాహైలెట్ అయిన అంశాలు ఏమిటి? అనే విషయమై ఓ లుక్కేద్దాం.
సెకండాఫ్ 45 నిమిషాలు బావుంది
సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ఉందని, హీరో హీరోయిన్ చాలా బాగా చేశారు. సెకండాఫ్ 45 నిమిషాలు బావుంది.
ఆకట్టుకోలేదు
ఫస్టాఫ్ పచ్చిగా, బోల్డ్ రొమాంటిక్ సీన్లతో సాగింది. సెకండాఫ్ స్క్రీన్ ప్లే బాగా సాగదీశారు. చివర్లో ట్విస్ట్ ఉన్నప్పటికీ అప్పటికే సహనం నశించింది.
సినిమా చాలా బావుంది
సినిమా చాలా బావుంది. నా రేటింగ్ 3.25/5
ఫస్టాఫ్ సూపర్, సెకండాఫ్ బావుంది
ఫస్టాఫ్: సూపర్
సెకండాఫ్: బావుంది
హీరో హీరోయిన్ యాక్టింగ్ బావుంది. చేతన్ మ్యూజిక్ ప్లస్. నా రేటింగ్ 3/5
ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళితే నచ్చుతుంది
సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే బావుంటుంది. హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్, క్లైమాక్స్ ట్విస్ట్, పాటలు, రొమాంటిక్ సీన్లు బావున్నాయి.
తప్పకుండా చూడాల్సిన సినిమా
ఓ అభిమాని ‘ఆర్ఎక్స్ 100' తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ.... అందుకు గల కారణాలు కూడా వివరించారు.


Click it and Unblock the Notifications











