For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తవాళ్లను నలిపేస్తారా? దిల్ రాజు ముందే ఆర్ఎక్స్ 100 హీరో సంచలన కామెంట్స్...

By Bojja Kumar
|
Rx 100 Hero Kartikeya Sensational Comments On dil raju

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం'ఆర్ఎక్స్ 100′. జులై 12న ప్రేక్షకులైన ఈ మూవీ బాక్సాఫిస్ వద్ద ఊహించని విజయం సాధించింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 3 కోట్లలోపే అమ్మేశారు. కానీ బాక్సాఫీసు వద్ద అంతకు రెట్టింపు రాబట్టి కాసుల పంట పండించంది. రూ. 11కోట్లపైగా షేర్ రాబట్టి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. సినిమా విడుదలైన 25 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకకు దిల్ రాజు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ ప్రసంగం ఆకట్టుకుంది.

 దిల్ రాజు లాంటి పెద్దలు నలిపేస్తారని భయపెట్టారు

దిల్ రాజు లాంటి పెద్దలు నలిపేస్తారని భయపెట్టారు

‘ఆర్ఎక్స్ 100' ఫస్ట్ ఈవెంట్ నుండి దిల్ రాజు సర్‌ను పిలవడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఫైనల్‌గా మా సక్సెస్ అయిన తర్వాత ఆయనకు మా ఈవెంటుకు రావడానికి కుదిరింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారికి ఏవో కొన్ని రూమర్స్ చెప్పి భయపెడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో దిల్ రాజు లాంటి ముగ్గురు నలుగురు ఉంటారు, థియేటర్లు ఇవ్వరు... సపోర్టు చేయరు, నలిపేస్తారు, తొక్కేస్తారని చెప్పి భయపెట్టారని కార్తికేయ తెలిపారు.

మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు

మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు

నలిపేస్తారు, తొక్కేస్తారు అనేది ఒక శాతం కూడా నిజం కాదు. అందుకు మా సినిమాయే ఉదాహరణ. దిల్ రాజుతో పాటు పెద్దలందరూ వందశాతం సపోర్ట్ చేశారు. మా సినిమా విడుదలైన తర్వాతి వారం దిల్ రాజు బేనర్ నుండి మరో సినిమా రిలీజ్ అయింది. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

అలా ఉంటే వారు ఆ స్థాయికి వెళ్లరు

అలా ఉంటే వారు ఆ స్థాయికి వెళ్లరు

పెద్దవాళ్లందరి ఆలోచన మనకంటే ఉన్నతస్థాయిలో ఉంటుందని అప్పుడు నాకు అనిపించింది. వాళ్లకు ఉన్న స్థాయికి చేయాలంటే ఏమైనా చేయొచ్చు... కానీ వాళ్లు అలాంటి వారు కాదని మా సినిమా రిలీజ్ సమయంలో ఓ క్లారిటీ వచ్చింది. అలా ఉంటే వారు ఆ స్థాయికి వెళ్లే వారు కాదు.

 అలాంటి చెత్త మాటలు నమ్మవద్దు

అలాంటి చెత్త మాటలు నమ్మవద్దు

కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చేపుడు బయట చెప్పే చెత్త మాటలు అస్సలు నమ్మ వద్దు. మీ ప్రొడక్ట్ సరిగా ఉండి, మూవీలో కంటెంటు ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. దిల్ రాజు లాంటి వారికి ఒక కొత్త హీరో, ఒక కొత్త డైరెక్టర్ వస్తే వారికే అడ్వాంటేజ్. డిఫరెంట్ హీరోలు, డిఫరెంట్ దర్శకులతో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది.

మాకు కావాల్సింది టాలెంటే: దిల్ రాజు

మాకు కావాల్సింది టాలెంటే: దిల్ రాజు

ఇలా చెప్పడం ద్వారా ఇండైరెక్టుగా నేను కూడా దిల్ రాజు సర్ వద్ద కమిట్మెంట్ అడుగుతున్నాను. (వెంటనే దిల్ రాజు మైక్ అందుకుని ఆల్రెడీ నువ్వే చెప్పావ్... టాలెంట్ ఉంటే నేనే మీ వెనకాల వస్తా, మాకు కావాల్సింది టాలెంటే అంటూ వ్యాఖ్యానించారు).

 భయపడ్డా, కానీ మీరు నిర్మాతకు కోట్లు ఇచ్చారు

భయపడ్డా, కానీ మీరు నిర్మాతకు కోట్లు ఇచ్చారు

సినిమా రిలీజ్ ముందు... ‘మీ పేరెంట్స్ ఈ సినిమా చూసి మిమ్మల్ని కొడితే... నన్ను కొట్టమని పంపించండి అని చెప్పాను. దర్శకుడేమో ఈ సినిమా బాగోలేకుంటే వెళ్లిపోయి ఊర్లో గేదెలు కాచుకుంటాను, రోటీన్ గా చూసే వారు ఈ సినిమాకు రాకండి అని చాలా మాట్లాడాం. కానీ సినిమా విడుదల ముందు రోజు అలా ఎందుకు మాట్లాడామని చాలా భయమేసింది. సినిమా బాగోలేకుంటే నేను తిరిగి డబ్బులిస్తానన్నాను... కానీ మీరే మా నిర్మాతకు కోట్లు కోట్లు ఇచ్చేశారు... అని కార్తికేయ వ్యాఖ్యానించారు.

English summary
RX100 Movie 25 Days Celebrations heald at Hyderabad. Tpo producer Dil Raju attended as chief guest for this event. RX 100 directed by Ajay Bhupathi. The film stars debutant Kartikeya Gummakonda and Payal Rajput in the lead roles. Rao Ramesh and Ramki were cast in supporting roles.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more