హిందీలో ఆర్ఎక్స్ 100 రీమేక్.. గజిని నిర్మాత నిర్మాణంలో, వర్మ ట్వీట్..!
టాలీవుడ్ లో ఆర్ఎక్స్ 100 చిత్రం సంచలనంగా మారిపోయింది. సినీ అభిమానుల మధ్య ఈ చిత్రమే హాట్ టాపిక్. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. కర్హికేయ నటన, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బోల్డ్ పెర్ఫామెన్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి చేర్చాయి. ఈ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి సంచలనంగా మారిపోయాడు.

ఊహించినట్లుగానే ఆర్ఎక్స్ 100 చిత్రం హిందీలో రూపొందబోతోంది. గజిని చిత్ర నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
బోల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం యువతని విపరీతంగా ఆకర్షిస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి వర్మ శిష్యుడే కావడం విశేషం. ఆర్ ఎక్స్ 100 చిత్రం దాదాపు 10 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications











