కార్తీకేయ ‘గుణ 369’ ప్రీ రివ్యూ: యదార్థ సంఘటనలతో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా..
RX100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం గుణ 369. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఆగస్టు 2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు బలంగా నిలిచిన అంశాలు మీకోసం..

వాస్తవ సంఘటనలు.. సహజత్వానికి దగ్గరగా
విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ గుణ 369 చిత్రానికి కథగా మారింది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలోని సన్నివేశాలు స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది అనే మాటను చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

సరికొత్తగా కార్తీకేయ ఫెర్ఫార్మెన్స్
RX100 ఫేమ్ కార్తికేయ హీరోగా పక్కింటి కుర్రాడిగానే కాకుండా.. పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. గుణ 369 తర్వాత RX 100తో వచ్చిన ఇమేజ్‌తో కొత్త రకమైన నటుడిని చూస్తారని స్వయంగా కార్తీకేయ చెప్పడం సినిమా విజయంపై ఉన్న కాన్ఫిడెన్స్‌ను చెప్పింది.

మలయాళీ ముద్దుగుమ్మ అనఘ
ఇక మలయాళీ ముద్దుగుమ్మ అనఘ ఈ సినిమాలో గ్లామర్ పరంగానే కాదు.. ఫెర్ఫార్మెన్స్ పరంగాను ఆకట్టుకోవడం ఖాయం. అనఘ తొలిసారి ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. గుణ 369 సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

భారీగా అంచనాలు.. ఆడియోకు ఫుల్ రెస్పాన్స్
మహిళల మనోభావాలకు బాసటగా నిలిచే చిత్రంగా రూపొందిన గుణ 369 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియోకు కూడా ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తొలి పాటను స్టార్ ప్రొడ్యూసర్ `దిల్`రాజు, రెండో పాటను ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, అలీ,మూడో పాటను దర్శకేంద్రులు కే రాఘవేంద్ర రావు విడుదల చేశారు. అలాగే ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించడం మరో విశేషం.

సింగిల్ కట్ లేకుండా సెన్సార్
ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ రావడం గుణ 369కు ఉన్న మరో ప్రత్యేకత. ఆగస్ట్ 2న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలోనే జరిగింది. తొలిసారి సినీ నిర్మాణంలోకి ప్రవేశించిన అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు అత్యుత్తమంగా సంతృప్తిని వ్యక్తం చేయడంతో సినిమాపై ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ నెలకొన్నది.

నటీనటులు, సాంకేతిక వర్గం
తెరవెనుక, తెర ముందు
మూవీ: గుణ 369
నటీనటులు: కార్తీకేయ, అనఘ తదితరులు
కథ, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల
సినిమాటోగ్రఫి: రాంరెడ్డి
మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్,
ఎడిటర్ : తమ్మిరాజు ,
డాన్స్ : రఘు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య కిశోర్, శివ మల్లాల.
రిలీజ్ డేట్: ఆగస్టు 2, 2019


Click it and Unblock the Notifications











