క్రేజీగా కార్తీకేయ మూడో సినిమా టైటిల్.. ఫస్ట్‌లుక్‌తోనే ఇరుగదీసాడుగా!

Recommended Video

Kartikeya's 3rd Movie Titled As 'Guna 369' || Filmibeat Telugu

RX 100 చిత్రంతో యూత్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొన్న హీరో కార్తీకేయ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఓ పక్కా హిప్పీ సినిమాను ట్రాక్‌పై పరుగెత్తిస్తూనే మరో వైపు మూడో సినిమా స్పీడ్ పెంచాడు. తన కెరీర్‌లో మూడో సినిమా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేయగా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ కార్తీకేయ మూడో సినిమా టైటిల్ ఏమిటంటే..

 మూడో సినిమాగా గుణ 369 మూవీ

మూడో సినిమాగా గుణ 369 మూవీ

హీరో కార్తీకేయ తన మూడో సినిమాను లవ్‌స్టోరీగా అందించబోతున్నాడు. ఈ సినిమాకు గుణ 369 టైటిల్‌ను ఖారారు చేశారు. స్పింట్ ఫిల్మ్స్, జాపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల నిర్మాతలుగా, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శివ మల్లాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

 రియలిస్టిక్‌, లవ్ అండ్ యాక్షన్ మూవీ

రియలిస్టిక్‌, లవ్ అండ్ యాక్షన్ మూవీ

గుణ 369 టైటిల్ రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని హీరో కార్తీకేయ మాట్లాడుతూ.. హిప్పీ తర్వాత వస్తున్న నా సినిమా Raw, Rustic, రియలిస్టిక్, లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. గుణ 369 సినిమా చాలా ఇంటెన్సివ్ స్క్రిప్ట్. వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. అలాంటి కథా నేపథ్యంగా ప్రేమ కథ నా ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి కథ మూడో సినిమాగా రావడం నా అదృష్టం అని హీరో కార్తీకేయ వెల్లడించారు.

 అర్జున్ జంధ్యాల చెప్పిన కథ గురించి

అర్జున్ జంధ్యాల చెప్పిన కథ గురించి

హీరో కార్తికేయ మాట్లాడుతూ ``కొన్ని క‌థ‌లు విన‌గానే న‌చ్చుతాయి. మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుకొస్తుంటాయి. న‌లుగురితో పంచుకోవాల‌నిపిస్తుంటాయి. నాకు అర్జున్ జంధ్యాల చెప్పిన క‌థ అలాంటిదే. విన‌గానే న‌చ్చింది. బెస్ట్ స్టోరీ టు టెల్ అనిపించింది. ఇప్ప‌టిదాకా తీసిన‌ ర‌షెస్ చూసుకున్నాం. ప్ర‌తి ఫ్రేమూ రియ‌లిస్టిక్‌గా వ‌చ్చింది. రియ‌లిస్టిక్ చిత్ర‌మిది`` అని అన్నారు.

 369 అంటే స్క్రీన్ మీదే చూడాలని

369 అంటే స్క్రీన్ మీదే చూడాలని

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఇంత‌కు ముందు ఒంగోలులో భారీ షెడ్యూల్ చేశాం. మ‌ళ్లీ ఈ నెల 29 నుంచి మే 15 వ‌ర‌కు మ‌రో భారీ షెడ్యూల్ చేయ‌బోతున్నాం. దాంతో ఒక సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ఇప్పుడు హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ చేస్తున్నాం. మా చిత్రంలో హీరో పేరు గుణ‌. `369` అంటే ఏంట‌నేది స్క్రీన్ మీదే చూడాలి. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌స్తోంది`` అని అన్నారు.

యువతరాన్ని ఉర్రూతలూగించే చిత్రంగా

యువతరాన్ని ఉర్రూతలూగించే చిత్రంగా

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ ``రియ‌ల్ ల‌వ్ ఇన్సిడెంట్స్ తో బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ క‌థ‌ను అద్భుతంగా త‌యారు చేసుకున్నాడు. విన‌గానే చాలా ఇంప్రెస్ అయి వెంట‌నే ఓకే చెప్పేశాం. ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్‌లో ఉంటుంది. క‌చ్చితంగా యువ‌త‌రాన్ని ఉర్రూత‌లూగించే విధంగా ఉంటుంది. హీరో కార్తికేయ కేర‌క్ట‌రైజేష‌న్ `ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ` క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది`` అని తెలిపారు.

గుణ 369 టెక్నికల్ టీమ్

గుణ 369 టెక్నికల్ టీమ్

హీరో కార్తీకేయ తన తొలిచిత్రం RX 100 తోనే భారీ హిట్ సొంతం చేసుకొన్నాడు. త్వరలోనే గుణ 369 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఫైట్స్ : రామకృష్ణ ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X