twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొందరి వల్ల ‘ఆర్ఎక్స్ 100’ వేలం డిస్ట్రబ్ అయింది: కార్తికేయ

    By Bojja Kumar
    |

    కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో వాడిన ఆర్ఎక్స్ 100 బైక్ కేరళ వరద బాధితులకు సహాయం చేయడం కోసం వేలం వేస్తున్నట్లు హీరో కార్తికేయ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.

    కనీస ధర రూ. 50 వేలుగా నిర్ణయించి బైక్ వేలం వేయగా కొందరు బిడ్డింగ్ చేశారు. అయితే చాలా మంది ఫేక్ బిడ్డింగ్ వేసి వేలాన్ని డిస్ట్రబ్ చేశారని, దీంతో బైక్ మా దగ్గరే ఉండిపోయిందని, తమ సొంత డబ్బును కేరళ వరద బాధితుల కోసం విరాళంగా ఇచ్చినట్లు కార్తికేయ తెలిపారు.

    మళ్లీ బైక్ వేలం వేసే సమయం కూడా లేదు. ఎవరైతే జెన్యూన్ బిడ్డింగ్ వేసిన వారు ఉంటారో... వారు ఆ డబ్బును కేరళ రిలీఫ్ ఫండ్ కోసం డొనేట్ చేయండి. డొనేట్ చేసిన స్క్రీన్ షాట్‌ను [email protected] అకౌంట్‌కు పంపండి చేయండి. ఎవరైతే డొనేట్ చేస్తారో అందరితో మీట్ అండ్ గ్రీట్ టుగెదర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని వల్ల ఎక్కువ అమౌంట్ కేరళకు సహాయంగా వెళుతుందని భావిస్తున్నాను అని కార్తికేయ తెలిపారు.

    RX100 movie Bike auction failed

    భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం భారీగా నష్ట పోయింది. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.

    English summary
    RX100 movie Bike auction failed. RX100 Bike Which is used in the film is for auction and the fundraised amount I'll be donated to #KeralaReliefFund.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X