కేరళ వరద సాయం కోసం ‘ఆర్ఎక్స్ 100’ మూవీ బైక్ వేలం

By Bojja Kumar

Recommended Video

#RX100 Team Fundraising Auction For Kerala Floods

కేరళ వరద బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఆర్ఎక్స్ 100 చిత్ర బృందం ఈ మూవీలో హీరో వాడిన బైక్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు.

ఈ విషయమై హీరో కార్తికేయ మాట్లాడుతూ... ఆర్ఎక్స్ 100 సినిమాకు మీరు అందించిన ప్రోత్సాహం మేము ఎప్పటికీ మరిచిపోలేము. ఒక సాంగ్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా మీరు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. కానీ అంతకు మించి సపోర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మనకు వచ్చింది. నిధుల సమీకరణ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో పాల్గొనాలని కోరుతున్నామన్నారు.

వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ వివరాలు, బిడ్ చేసే అమౌంట్ [email protected] కి మెయిల్ చేయండి. లేదంటే 9100445588 ఫోన్ నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని ఈ సందర్భంగా కార్తికేయ తెలిపారు. బిడ్డింగ్ రూ. 50 వేల నుండి మొదలవుతుందన్నారు.

RX100 Team Fundraising Auction for Kerala Flood Relief Fund

భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో అక్కడ జనజీవనం చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X