»   » ‘నా ఆటోగ్రాఫ్’ దర్శకుడితో నాగార్జున

‘నా ఆటోగ్రాఫ్’ దర్శకుడితో నాగార్జున

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రవితేజ హీరోగా 'నా ఆటోగ్రాఫ్' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి మరో సారి దర్శకత్వానికి సిద్ధం అవుతున్నారు. త్వరలో ఆయన నాగార్జున హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

దుర్గాఆర్ట్స్ బేనర్‌పై ఎస్.గోపాల్ రెడ్డే ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. తొలుత తాను నిర్మాతగా మాత్రమే ఉండాలనుకున్నారు. తాను అనుకున్న దర్శకులు ఎవరూ ఈ సినిమా చేయడానికి వివిధ కారణాల వల్ల ముందుకు రాక పోవడంతో చివరకు తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఎస్.గోపాల్ రెడ్డి సంతోషం సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు.

ప్రస్తుతం నాగార్జున భాయ్ సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. 'భాయ్' మూవీ ఆడియో ఆగస్టు 16న విడుదల చేసేందుకు, సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంమై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.

యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

English summary
Popular cinematographer S Gopal Reddy may soon wield megaphone. Senior and popular cinematographer S Gopal Reddy tuned director with Raviteja’s movie Autograph. It is said that S Gopal Reddy is once gain trying his hands at direction. Nagarjuna is the hero in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu