twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదేళ్ల తరవాత...ఎస్‌.జానకి మళ్లీ...

    By Srikanya
    |

    S Janaki
    హైదరాబాద్ : తెలుగు,తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ పాడిన ప్రముఖ గాయని ఎస్‌.జానకి ఈ మద్యన అస్సలు పాడటం లేదు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ గొంతు సవరించుకోనున్నారు. దాదాపు పదేళ్ల తరవాత తొలిసారి ఓ పాట పాడనున్నారు. అదీ.. ఓ తమిళ చిత్రం కోసం.

    ధనుష్‌ హీరోగా నటిస్తున్న తమిళ చిత్రం 'విఐపి'. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ మెలోడీ గీతాన్ని జానకి పాడనున్నారు. ఆమెతో పాటు హీరో ధనుష్‌ కూడా గొంతు కలపబోతున్నారు. ''జానకి గారు పాట పాడడానికి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొంతకాలంగా ఆమె పాటలకు దూరంగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తరావాత మా చిత్రం కోసం పాట పాడడం ఉద్వేగాన్ని కలిగిస్తోంది''అని సంగీత దర్శకుడు చెప్తున్నారు.

    ఎస్. జానకి తెలుగులో తొలిసారిగా 'ఎం.ఎల్‌.ఏ' చిత్రం లో 'నీ ఆశ...అడయాస...లంబా డోళ్ల రాం దాసా' అనే పాటను పాడారు. తెలుగులో ఆమె టాలెంట్‌ను గుర్తించి ప్రముఖ నిర్మాత రామోజీ ఆమెను తన చిత్రం 'మౌనపోరాటం'కు సంగీత దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. ఆ చిత్రం సంగీతపరంగా మ్యుజికల్‌ హిట్‌ కూడా అయింది. అంతకుముందు జానకి ఉషాకిరణ్‌ వారి 'ప్రతిఘటన' చిత్రంలో పాడిన 'ఈ ధుర్యోదన, దుశ్సాసన, దుర్వినీతి లోకంలో' అంటూ పాడిన పాటకు అన్ని వర్గాల ప్రజలనుంచి ప్రశంస లు అందుకున్నారు. భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు కావడం విశేషం.

    జానకి తన గాయికా జీవితంలో బిస్మిల్లాఖాన్‌, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్‌, పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతో కలిసి పనిచేశారు ఆమె. ఆరుసా ర్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారామె. మహమ్మద్ఫ్రీ, లతామంగేష్కర్‌, ఆశాభోస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్‌. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం.

    జానకి. తెలుగు, కన్నడం, మలయాళం, తమిళం, హిందీ తదితర భాషల్లో విస్తృతంగా గానం చేసిన జానకి ఇళయ రాజా సంగీత దర్శకత్వంలో పాడిన కొన్ని అద్భుత గీతాలు ఆమె ప్రతిభకు అద్దంపడతాయి. కలైమామణి, గౌరవ డాక్టరేట్ పట్టాలాంటి పురస్కారాలు సైతం ఆమెని వరించాయి. కానీ, 74 సంవత్సరాల జానకికి ఇంతవరకూ ఒక్క పద్మ పురస్కారం కూడా రాలేదు.

    English summary
    The veteran singer S Janaki after many years is back to singing. She has crooned a duet with Dhanush for Velai Illa Pattathari (VIP) which has music by Anirudh. Remember the singer was recently in the news for rejecting the Padma Bhushan award, stating it had come too late in her 55-year-long career. The song is said to be a lilting melody which will be picturised on Dhanush and Amala Paul. Dhanush whose Wunderbar are the producers had tweeted - "Velai illa pattadhaari team is honored wid the return of the legend s.janaki Amma. Im blessed and lucky 2 have sung along with her".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X