నేను క్షేమంగా ఉన్నాను.. మీరు జాగ్రత్తగా ఉండండి.. అభిమానులకు జానకమ్మ సందేశం
సంగీత ప్రపంచంలో ఎస్ జానకిది ప్రత్యేకమైన చరిత్ర. భారతీయ భాషల్లోని మాధుర్యాన్ని తన గొంతుకలో వినిపించే కోట్లాది శ్రోతల హృదయాలను గెలుచుకున్నారు. ఎస్ జానకి నుంచి జానకమ్మగా మారిపోయింది. సంగీత ప్రపంచంలో అమ్మగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా అన్ని భాషల్లో జానకమ్మ ఎన్నో ప్రయోగాలను చేశారు.
తెలుగు పాటలు, తెలుగు భాష ఉన్నంత వరకు జానకమ్మ చిరస్థాయిగా నిలిచే ఉంటారు. అలాంటి జానకమ్మపై తప్పుడు వార్తలు రావడం, ఆరోగ్యం బాగా లేదని వదంతులు సృష్టించడంపై అభిమాన గణం తీవ్రంగా దు:ఖిస్తున్నారు. వీటిపై జానకమ్మ స్పందిస్తూ.. తన అభిమానులకు ఓ సందశాన్ని ఇచ్చారు.

ఆరోగ్యంపై రూమర్స్..
జానకమ్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక రూమర్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి వార్తలో వచ్చాయి. తాజాగా మరోసారి జానకమ్మ ఆరోగ్యంపై తప్పుడు కథనాలు దావానంలా వ్యాప్తిచెందాయి. వీటిపై సినీ సంగీత ప్రముఖులు వెంటనే స్పందించారు.

ఆవేదన చెందిన బాలు..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల బంధం గురించి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సుమధురమైన పాటలు వచ్చాయి. కేవలం వృత్తి పరంగానే కాకుండా ఎస్పీబీ జానకమ్మను తల్లిగా, గురువుగా భావిస్తారు. అందుకే ఆమెపై వచ్చిన రూమర్స్ వెంటనే ఖండిస్తూ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇలాంటి రూమర్స్‌పై ఫైర్ అయ్యారు.

స్పందించిన జానకమ్మ..
తన మీద వచ్చిన రూమర్స్‌పై జానకమ్మ స్పందించారు. తాను ఎక్కడో మైసూర్‌లో క్షేమంగా ఉంటే.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో, ఎందుకు పుట్టిస్తారో ఎవరు చేస్తారో తెలియడం లేదని ఆవేదన చెందారు. అయితే తాను క్షేమంగా ఉన్నానని తన అభిమానులకు తెలిపారు.
Recommended Video

మీరు జాగ్రత్తగా ఉండండి..
వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా పిచ్చిపిచ్చిగా ఎందుకు రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మనిషి ఉన్నాడని, పోయాడని అలా ఎలా రాస్తారని చెప్పుకొచ్చారు. ఈ వార్తలు విని ఎంతో మంది అభిమానులు ఫోన్ చేసి ఏడ్చారని, వారిని ఓదార్చేందుకు తన శక్తి సరిపోయిందని తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, మీరే జాగ్రత్తగా ఉండండని హైద్రాబాద్‌లో కరోనా ఎక్కువగా ఉందని అభిమానులకు సూచించారు.


Click it and Unblock the Notifications











