twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక ఆ స్వరం పాడదు: సంగీతానికి వీడ్కోలు చెప్పిన ఎస్.జానకి

    మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొని ఆహూతులను అలరించారు. మైసూరులో ప్రారంభించిన తన ప్రస్థానానికి క సంస్థకు విరాళాలను సమకూర్చేందుకు తన చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు.

    |

    ఇంచుమించి 6 దశాబ్దాలు ఇప్పటి ఆయు:ప్రమాణం ప్రకారమైతే ఒక సాధారణ మానిషి జీవితకాలం... అన్ని సంవత్సరాలుగా పాడుతూనే ఉన్న ఆ స్వరం ఇక చాలు అంటూ ఇప్పుడు పాటకి వీడ్కోలు చెప్పింది. అవును జానకామ గా అభిమానులు పిలుచుకున్న గాయని ఎస్.జానకి ఇక పాడటం ఆపేస్తున్నానని చెప్పి అభిమానులని నిరాశలో ముంచేసింది. ఆమె తన సుస్వర ప్రస్థానానికి ఎక్కడైతే శ్రీకారం చుట్టారో అక్కడే ముగింపు పలికారు.

    మైసూరులో

    మైసూరులో

    ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకి. పలు చిత్రాలకు నేపథ్యగానాన్ని అందించిన ఆమె గత కొంతకాలంగా వేదికలపై పాటల్ని పాడటాన్ని నిలిపివేసిన విషయం విదితమే. ఒక సంస్థకు విరాళాలను సమకూర్చేందుకు ఆమె రాచనగరి మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సంగీత రవళులకు జన్మనిచ్చిన మైసూరులోనే ఈ ప్రస్థానానికి ముగింపు పలకడం ద్వారా ఈ పట్టణంపై మమకారాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు.

    మైసూరులోనే ముగింపు

    మైసూరులోనే ముగింపు

    తన 60 ఏళ్ల స్వర ప్రస్థానంలో 17 భాషలలో 48 వేల పాటలు పాడిన నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా గానానికి వీడ్కోలు పలికింది.ముందుగా ప్రకటించిన ప్రకారమే లెజెండరీ సింగర్ ఎస్ .జానకి శనివారం మైసూరులో తన ఆఖరి పాటను పాడింది. తన సుస్వర ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన మైసూరులోనే ముగింపు పలికింది గాన సరస్వతి.

     ఓ స్వచ్ఛంద సంస్థ కోసం

    ఓ స్వచ్ఛంద సంస్థ కోసం

    గాన కోకిల జానకి చివరగా గత సంవత్సరం ఓ మలయాళ చిత్రానికి నేపథ్య గానం చేశారు. అదే తన చివరి పాట అని ప్రకటించారు. ఆ తర్వాత ఆమె వేదికలపై ప్రదర్శనలను కూడా నిలిపివేశారు. అయితే ఆమె వీరాభిమానులు ప్రవీణ్ పవన్ నవీన్ల విన్నపం ప్రకారం ఓ స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా పాడేందుకు ఆమె అంగీకరించారు.

    చివరి సంగీత విభావరి

    చివరి సంగీత విభావరి

    మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొని ఆహూతులను అలరించారు. మైసూరులో ప్రారంభించిన తన ప్రస్థానానికి అక్కడే ముగింపు పలికారు. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్తో కలిసి జానకి 1952లో మైసూరు నుంచే పాటలను పాడడం ప్రారంభించడం విశేషం.

     చివరి ప్రదర్శన

    చివరి ప్రదర్శన

    ఆ లెజెండరీ సింగర్ చివరి ప్రదర్శనను తిలకించేందుకు వేలాదిమంది సంగీతాభిమానులు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆమె పాటలను విని పులకించారు. ఈ సందర్భంగా రాజవంశస్థురాలు ప్రమోదా దేవి ఒడయరు మాజీ మంత్రి జి.టి.దేవెగౌడ అలనాటి నాయికలు జయంతి భారతీ విష్ణువర్ధన్లు జానకిని ఘనంగా సత్కరించారు.

    40 రాష్ట్ర స్థాయి అవార్డులు

    40 రాష్ట్ర స్థాయి అవార్డులు

    జానకి గాన మాధుర్యానికి గానూ ఆమెను పలు అవార్డులు వరించాయి. ఈ లెజెండరీ సింగర్ 4 సార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్ తరపున 4 నంది అవార్డులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 40 రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకుంది.

    2013లో పద్మభూషణ్

    2013లో పద్మభూషణ్

    కళారంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2013లో ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. అయితే దక్షిణాది కళాకారులపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని తనకు ఆ గౌరవం ఆలస్యంగా దక్కిందనే కారణాలతో జానకి ఆ అవార్డును సున్నితంగా తిరస్కరించారు

    English summary
    Renowned singer S Janaki will be saying goodbye to her 65-years long singing career after a concert at Mysuru. The first concert of Janaki was also held here in the city in 1952.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X