twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘S/O సత్యమూర్తి’ మళయాలం రైట్స్ రికార్డ్ రేటు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.....కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగి ఉన్న తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తాజా సినిమా ‘S/O సత్యమూర్తి' మళయాలం రైట్స్ భారీ ధరమ్మకు అమ్ముడయ్యాయి.

    కేరళలకు చెందిన లీడింగ్ ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రం హక్కులను రూ. 1.75 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బింగ్ సినిమాలకు కేరళలో ఇంత పెద్ద మొత్తం పలకడం విశేషమే. ఇప్పటికే విడుదలైన ఆడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    S/O Satyamurthy Malayalam rights for record price

    ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న కానీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన 8న కానీ విడుదలయ్యే అవకాసం ఉంది. అల్లు అర్జున్ సరసన సమంతా, అదా శర్మ, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

    ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

    English summary
    Stylish Star Allu Arjun's upcoming Trivikram celluloid Son of Satyamurthy Malayalam dubbing rights have been sold out for a fancy price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X