‘S/O సత్యమూర్తి’ శాటిలైట్ రైట్స్ కేక....
హైదరాబాద్: ‘S/O సత్యమూర్తి' చిత్రం విడుదల ముందు బిజినెస్ అదరగొడుతోంది. తాజాగా ఈచిత్రానికి శాటిలైట్ రైట్స్ రూపంలో అదిరిపోయే ధర వచ్చింది. ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్ ఈ చిత్రం రైట్స్ రూ. 8.85 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జన్ సినిమాకు ఈ రేంజిలో ధర పలకడం ఇదే తొలిసారి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు.

ఈ ఆడియో విడుదల హైదరాబాద్ లో జరుగ్గా... సక్సెస్ మీట్ విజయవాడలోని హాయ్ ల్యాండ్ లో జరిగింది. 'S/o సత్యమూర్తి' చిత్రం ఈ నెత 9న గ్రాండ్ గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆడియో వేడుక, ఆడియో సక్సెస్ మీట్లు నిర్వహించడం ద్వారా సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











