‘S/O సత్యమూర్తి’ సక్సెస్ మీట్ (ఫోటోస్)
వైజాగ్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ గురువారం(ఏప్రిల్ 23) వైజాగ్ లో నిర్వహించారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ వేడుకకు హాజరై సందడి చేసారు. ఈ విజయోత్సవ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు, ప్రేక్షకులు ఈ సందర్భంగా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ చిత్రం మళయాల వెర్షన్ ఈ రోజు (ఏప్రిల్ 24) కేరళలో విడుదలయింది. నిన్నమొన్నటి వరకు సినిమా ప్రమోషన్లలో భాగంగా కేరళలో గడిపిన అల్లు అర్జున్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి కాగానే వైజాగ్ లో జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మళాయలంలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఆయన గత చిత్రాలు అక్కడ కూడా విడుదలై మంచి కలెక్షన్లు సాధించాయి. అందుకే తన ప్రతి సినిమా మళయాలంలోనూ తప్పకుండా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు అల్లు అర్జున్.
స్లైడ్ షోలో వైజాగ్ సక్సెస్ మీట్ కు సంబంధించిన ఫోటోలు...

అల్లు అర్జున్-త్రివిక్రమ్
వైజాగ్ లో జరిగిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం సక్సెస్ మీట్లో అల్లు అర్జున్, త్రివిక్రమ్.

అభిమానులకు అభివాదం
అభిమానుల, ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి అభివాదం చేస్తున్న అల్లు అర్జున్.

సన్మానం
అభిమాన సంఘాల నేతలు అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లను భారీ గజమాలతో సన్మానించారు.

బహుమానం
అభిమానులంతా కలిసి అల్లు అర్జున్ కు తాత అల్లు అరామయ్య ప్రతిరూపాన్ని బహుమతిగా ఇస్తున్న దృశ్యం.

అభిమానులు
సన్నాఫ్ సత్యమూర్తి విజయోత్సవ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన అభిమానులు.


Click it and Unblock the Notifications











