twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'S/O సత్యమూర్తి' ఆడియో వేడుకపై విమర్శలు...

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'S/O సత్యమూర్తి' ఆడియో వేడుక ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆడియో వేడుక సూపర్ హిట్టయింది. అంతా బానే జరిగింది. అయితే ఓ విషయంలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆడియో వేడుకలో ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ నటుడు, ఈ చిత్రంలో నటించిన ఎంఎస్ నారాయణ ప్రస్తావన ఎవరూ తేక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఎంఎస్ గౌరవార్తం, ఆయన ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాల మౌనం కూడా పాటించక పోవడం గమనార్హం.

    S‬/O Satyamurty audio: No one talked about MS garu

    ఎమ్.ఎస్ నారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం టాలీవుడ్‌ను షాక్ కు గురి చేసింది. ఆయన నటిస్తున్న పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరికొన్నింటిలో ఆయన షూటింగ్ పూర్తయినా డబ్బింగ్ పూర్తి కాలేదు. డబ్బింగ్ పూర్తికాని సినిమాల్లో బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా(సన్నాఫ్ సత్యమూర్తి) కూడా ఒకటి. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, నటుడు శివారెడ్డి ఎంఎస్ నారాయణ వాయిస్ పర్ ఫెక్టుగా చేసి చూపడంతో త్రివిక్రమ్ అతన్ని ఓకే చేసి డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది.

    సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఎంఎస్ నారాయణ భీమవరం వెళ్లారు. అక్కడ ఆయనకు మలేరియా సోకడంతో 19న ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు షుగర్, కిడ్నీ, హార్ట్ సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌ కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23న మరణించారు.

    English summary
    No one talked about MS Narayan at S‬/O Satyamurty audio function. No one even spelt his name while speaking about cast. No 2min silence for MS garu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X