నా సమాధి మీద ఆ మాటలు రాయండి.. అదే నా ఆస్తి, చివరి కోరిక: SB బాలు ఓల్డ్ కామెంట్స్
ఇండియన్ మ్యూజిక్ హిస్టారిలో ఘంటసాల తరువాత ఆ స్థాయిలో సంగీత ప్రియులకు ఎంతగానో ఆకట్టుకున్న గాయకుడు SP. బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎలాంటి పాట పాడినా కూడా అందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఎస్పీబీ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భం చాలా తక్కువ. ఆయన మనసులో అనుకున్న విషయాలను చాలా బలంగా చెప్పగలరు. ఇక 2017లో ఒక యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో SPB ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు.
Recommended Video

సమాధిపై ఆ వ్యక్తి చెప్పిన మాటలు
ఈ రోజు మధ్యాహ్నం 1:04 గంటలకు బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక ఆయన అంత్యక్రియలకు కుమారుడు SP చరణ్ కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన ఇంటర్వ్యూలో మరణించిన తరువాత తన సమాధిపై ఒక ఒక వ్యక్తి చెప్పిన అద్భుతమైన మాటలను రాయగలిగితే చాలా సంతోషమని అన్నారు.

బాలు అప్పుడు ఏమన్నారంటే..
బాలు మాట్లాడుతూ.. 1999లో పాడుతా తియ్యగా మెగా ఫైనల్స్ నిర్వహిస్తున్నప్పుడు మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన అన్న మాటలు నేను మర్చిపోలేరు. రాజేశ్వరరావు గారు,మహదేవన్, సుశీల, LR ఈశ్వరి వంటి వారు కూడా వేడుకలో ఉన్నారు.

బాలు కష్టపడితే .. నాలాగా పాడగలడు
అప్పుడు బాలమురళి కృష్ణ గారు ఒక మాట అన్నారు. "బాలు కాస్త కష్టపడితే నాలాగా పాడగలడు.. కానీ నేను కష్టపడినా కూడా మా అబ్బాయి లాగా పడలేను".. అని ఆయన పుత్రవాత్సల్యంలో వాడు కొంత చేసిన ఎంతో కనపడుతుంది అనేలా నా మనసును తాకేలా మాట్లాడారు. అంతకంటే ఆప్యాయత కీర్తి నాకు మరొకటి అవసరం లేదు. అదే నా ఆస్తి అనుకుంటాను.

నా సమాధిపైన అలా రాస్తే చాలు
మంగళంపల్లి బాలమురళీకృష్ణ మురళి వంటి గొప్ప సంగీత కళాకారుడు అలాంటి మాటలతో నాకు ఇచ్చిన స్ఫూర్తిని నేను ఎన్నటికి మరువలేను. నా సమాధి మీద గనక ఏదైనా రాయాలని ఆనిపిస్తే ఒక అవతార పురుషుడు ఇతన్ని ఇలా ఆశీర్వదించారు అని రాస్తే సరిపోతుంది. అంతలా బాలమురళీకృష్ణగారు నన్ను కదిలించారు.

ఆయన నన్ను హెచ్చరించారు
ఆయన నన్ను ఒక కుమారుడిలా భావించి హెచ్చరించారని నేను అనుకుంటున్నాను. ఎంతో మంది నా వద్దకు వచ్చి సంగీతం నేర్చుకుంటున్నారు. నాకు కుదరక కొందరికే నేర్పిస్తున్నాను. అలాంటిది నువ్వు నన్ను నాన్నగారు అని పిలుస్తున్నావ్. ఆ విధంగా సంగీతం మెర్చుకోలేవా రా..నువ్వు అని ఆయన ఒక భావన కల్పించారు. నిజంగా ఆయన వద్ద కొంచెం నేర్చుకున్నా కూడా నాకు ఇంకా తొందరగా మంచి గుర్తింపు అనుభవం వచ్చి ఉండేదేమో అని బాలు తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











