twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికీ విజయం సాధించలేని అంజి, అమృతరావుల సక్సెస్ స్టోరీ ఇది: రాజమౌళి కామెంట్స్

    |

    అటు వెండితెర, ఇటు బుల్లితెర ఈ రెండూ కూడా ప్రేక్షకలోకానికి రెండు కళ్ల లాంటివి. బుల్లితెర సీరియల్స్ ఆసాదిస్తూ వెండితెరపై సినిమాలు ఎంజాయ్ చేస్తున్న రోజులివి. అందుకే చాలామంది నటీనటులు బుల్లితెర బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన సీరియల్స్ యొక్క సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ''అమృతం అద్వితీయం'' రాబోతోంది. దీనిపై రాజమౌళి కామెంట్ చేశారు. వివరాల్లోకి పోతే..

    ‘అమృతం' సీరియల్.. టెలివిజన్ చరిత్రలో!

    ‘అమృతం' సీరియల్.. టెలివిజన్ చరిత్రలో!

    ‘అమృతం' సీరియల్.. ఈ సీరియల్ పేరు చెప్పగానే అందరూ దాని తాలూకు ఊహల్లో తేలుతుంటారు. ఒకానొక సమయంలో అమృతం వస్తుందంటే చాలు.. బుల్లితెరకు జనాలు అలా అతుక్కునేంతగా ప్రభావం చూపింది ఆ సీరియల్. మొత్తంగా చెప్పాలంటే టెలివిజన్ చరిత్రలో ఈ సీరియల్‌కి ఓ ప్రత్యేక అధ్యాయం ఉంది.

    అంజి, అమృతరావు.. ప్రేక్షకుల గుండెల్లో చెదరని గూడు

    అంజి, అమృతరావు.. ప్రేక్షకుల గుండెల్లో చెదరని గూడు

    ఇక ఈ సీరియల్ నటీనటుల విషయానికొస్తే.. అంజి, అమృతరావు, సర్వం పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెదరని గూడు కట్టుకున్నాయి. సీరియల్ ప్రసారాలు ఆగిపోయాక కూడా.. ఎప్పటికీ చెదిరిపోని జ్ఞాపకాలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలో 'అమృతం' ప్రసారాలను, ఆ అనుభవాలను తిరిగి ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేశారు.

    ఉగాది కానుకగా ‘అమృతం ద్వితీయం'

    ఉగాది కానుకగా ‘అమృతం ద్వితీయం'

    దాదాపు 19 ఏళ్ల తరవాత ‘అమృతం'కు సీక్వెల్‌ తీసుకురానుడటం విశేషం. ‘అమృతం ద్వితీయం' పేరుతో సిరీస్ రాబోతోంది. ఈ కామెడీ సిరీస్ ఉగాది కానుకగా మార్చి 25 నుంచి మొదలుకాబోతోంది. జీలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. అయితే, ఈ సీక్వల్‌కి సంబంధించి ఓ ట్రైలర్ ద్వారా శాంపిల్ చూపించారు మేకర్స్.

    ‘అమృతం ద్వితీయం' నిజంగా అద్వితీయం.. రాజమౌళి

    ‘అమృతం ద్వితీయం' నిజంగా అద్వితీయం.. రాజమౌళి

    ఈ ట్రైలన్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ మేరకు సీరియల్ పై తన అభిప్రాయం తెలుపుతూ ‘అమృతం ద్వితీయం' నిజంగా అద్వితీయం అని పొగిడారు. నాలుగు సార్లు ప్రసారమైన ఏకైక సీరియల్. 270 మిలియన్ వ్యూస్.. గడిచిన కొద్ది నెలలుగా నెలకు 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్ ఇది అని అన్నారు రాజమౌళి.

    ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం

    ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం

    ''ఎప్పటికీ విజయం సాధించలేని హీరోలు అంజి, అమృతరావుల సక్సెస్ స్టోరీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అమృతం' సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీనికి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కావాలని అభిమానులు కోరుకున్నారు. మొత్తానికి ఈ ఉగాది అమృతం ద్వితీయంను తీసుకొస్తోంది. ఇది నిజంగా అద్వితీయం'' అని రాజమౌళి సందేశమిచ్చారు.

    Recommended Video

    RRR Makers To Finalize This Title ? | Filmibeat Telugu

    గుండు హనుమంతరావు మరణం.. ఎల్బీ శ్రీరాం

    ఇకపోతే ‘అమృతం'లో ఆంజనేయులు పాత్ర పోషించి మెప్పుపొందిన గుండు హనుమంతరావు కన్నుమూయడంతో ఆయన పాత్రలో ఇప్పుడు ఎల్బీ శ్రీరాం నటిస్తున్నారు. హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి తమ పూర్వ పాత్రలే పోషిస్తుండగా.. సత్యక్రిష్ణ, కాశీ విశ్వనాథ్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Amrutham serial sequel trailer released by S. S. Rajamouli. he commented on this serial in his social media wall.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X