కేక న్యూస్ : దేశంలోనే తొలిసారి... 'బాహుబలి' కోసం

By Srikanya

హైదరాబాద్ : ఇప్పటికే 'బాహుబలి'కి సంబంధించిన టీజర్‌ సోషల్ మీడియాలో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మరో వార్తను రాజమౌళి ప్రకటించారు. అది మరింత ఉత్తేజపరిచేది. అదేమిటంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'బాహుబలి సినిమాకోసం వినియోగించిన వస్తువులతో ప్రత్యేకంగా ఓ మ్యూజియంని ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా ఒక సినిమా కోసం మ్యూజియం ఏర్పాటు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి. 'బాహుబలి'లో నటీనటులు వాడిన ఆయుధాలు, వాళ్లు ధరించిన దుస్తులు, కవచాలు ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచబోతున్నారు. రాజమౌళి ఆలోచనల మేరకే ఈ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు.

S S Rajamouli To Create A Museum Of His Film Baahubali

ఇక టీజర్ విషయానికి వస్తే...

శనివారం రాత్రి 7.30కి 'బాహుబలి'కి సంబంధించిన ఓ టీజర్‌ని విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసారు...అభిమానులను ఆనందపరిచారు. 20 సెకన్లపాటు సాగే ఆ టీజర్‌ 'బాహుబలి' సినిమా స్థాయి ఏమిటో చాటి చెబుతోంది. వేలాది మంది సైనికులు పోరాటంలోకి దిగుతుండగా... రానా కత్తి దూసేందుకు సన్నద్ధమవుతూ ఆ టీజర్‌లో కనిపించాడు. చివరిగా ప్రభాస్‌ కళ్లను మాత్రమే చూపించారు. జూన్‌ 1న 2 నిమిషాల ట్రైలర్‌ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రభాస్‌ హీరోగా నటించారు. అనుష్క, తమన్నాహీరోయిన్స్. రానా విలన్ గా కనిపిస్తారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకుడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. కీరవాణి సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X