ఎట్టకేలకు కుదిరింది.. సూపర్ స్టార్‌తో రాజమౌళి సినిమా.. ప్రపంచ స్థాయి చిత్రంగా!

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా ఓ బ్రాండ్ గా మారిపోయారు. రాజమౌళి సినిమా కోసమే లక్షలాదిమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ వ్యాప్తం చేశారు. ప్రస్తుతం రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ పూర్తి కావడానికి ఇంకా ఏడాదిపైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే రాజమౌళి తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

Recommended Video

#RRRShootBegins : Rajamouli Shares RRR Movie Shooting Stills | Filmibeat Telugu
ఎట్టకేలకు కుదిరింది

ఎట్టకేలకు కుదిరింది

చాలా కాలంగా రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంది అనే విషయంలో రాజమౌళి, మహేష్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ అభిప్రాయానికి కూడా వచ్చారట.

ఊహకందని విధంగా

ఊహకందని విధంగా

బాహుబలి రెండు భాగాలతో మూడేళ్లకు పైగా బిజీ బిజీగా రాజమౌళి గడిపారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడప్పుడే జక్కన్న భారీ చిత్రాలని విడిచిపెట్టేట్లు కనిపించడం లేదు. మహేష్ బాబుతో తెరకెక్కించే చిత్రం కూడా ఊహకందని బడ్జెట్ తో ప్రపంచస్థాయిలో ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి.

 ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది. తొలిరోజు ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ ప్రారంభమైందంటూ రాజమౌళి ట్వీట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. రాంచరణ్, ఎన్టీఆర్ మధ్యలో జక్కన్న కూర్చుని ఉన్నారు. షూటింగ్ కోసం క్రేన్లతో భారీ కసరత్తే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండు చిత్రాలు పూర్తి చేసి

ఆ రెండు చిత్రాలు పూర్తి చేసి

ఇక సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సుకుమార్ దర్శత్వంలో చిత్రాన్ని ప్రారంభిస్తాడు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ పూర్తి చేసే లోపు ఈ చిత్రం కూడా పూర్తవుతుంది. అంటే మహేష్ ఈ లోపు రెండు చిత్రాలు పూర్తి చేసి రాజమౌళి సినిమాకోసం సిద్ధంగా ఉంటాడన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X