»   » సర్ప్రైజ్...! టీవీ సిరీస్ గా బాహుబలి... ది రైజ్ ఆఫ్ శివగామి పేరుతో

సర్ప్రైజ్...! టీవీ సిరీస్ గా బాహుబలి... ది రైజ్ ఆఫ్ శివగామి పేరుతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాజాగా బాహుబలిపై ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు. బాహుబలి కథకు ప్రీక్వెల్‌గా విడుదల చేసిన పుస్తకం 'ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' ఆధారంగా ఈ మినీ టీవీ సిరీస్‌ను రూపొందిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు.తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువెత్తు గర్వకారణం బాహుబలి.

ప్రీక్వెల్‌ సీన్లతో

ప్రీక్వెల్‌ సీన్లతో

ప్రపంచ సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న సినిమా. త్వరలో ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత ఆనంద్‌ నీలకంఠన్ ఈ చిత్ర కథకు ప్రీక్వెల్‌ సీన్లతో మూడు భాగాల పుస్తకాన్ని రాస్తున్నారు. ఆ పుస్తకానికి ‘ది రైజ్‌ ఆఫ్‌ శివగామి' అని పేరు పెట్టారు.

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' మాదిరిగా

‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' మాదిరిగా

హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' మాదిరిగా ‘బాహుబలి' కూడా సిరీస్ గా అలరిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే, ఒకేసారి ఓ పది పదిహేను ఎపిసోడ్స్ పిక్చరైజ్ చేసి, అవి పూర్తయ్యే లోపు ఆ కథను ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ అవే క్యారెక్టర్లను చూపిస్తూ ఫ్రెష్ స్టోరీతో వస్తారు.

ఎంత కాలం వీలైతే అంత కాలం

ఎంత కాలం వీలైతే అంత కాలం

ఇలా ఎంత కాలం వీలైతే అంత కాలం, టీఆర్ఫీలు వస్తున్నంత కాలం ‘బాహుబలి' టీవీ సిరీస్ ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఇప్పుడు ‘బాహుబలి' టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ‘బాహుబలి' ని ముందుకు తీసుకెళ్తున్న విధానాలకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

ది రైజ్‌ ఆఫ్‌ శివగామి

ది రైజ్‌ ఆఫ్‌ శివగామి

ది రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో విడుదలైన మూడు పుస్తకాల ఆధారంగా ఒక మినీ టీవీ సిరీస్‌ను రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నాం. అయితే మనం రోజూ టీవీలో చూసే డైలీ సోప్‌లా ఉండదది. దీన్ని 13 ఎపిసోడ్లలో అద్భుతమైన సీజనల్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నాం" అని రాజమౌళి చెప్పారు.

ఆనంద్‌ నీలకంఠన్‌

ఆనంద్‌ నీలకంఠన్‌

బాహబలి రాజ మాత శివగామికి సంబంధించిన కథను మూడు భాగాలుగా ఆనంద్‌ నీలకంఠన్‌ అనే రచయిత రాశారు. అందులో మొదటి పుస్తకాన్ని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ కథలో శివగామి మాహిష్మతి రాజ్యానికి రాణి. కట్టప్ప అనే మరో అద్భుతమైన పాత్ర కూడా ఈ కథలోనే పరిచయమవుతుంది. శివగామి పాత్రలో ఒక రాజమాతతోపాటు ఒక గొప్ప యోధురాలు కన్పిస్తుందట.

40 కొత్త పాత్రలను

40 కొత్త పాత్రలను

మాహిష్మతి సామ్రాజ్ఞిగా శివగామిగా ఎదిగిన ఆమె జీవితంలో ‘బాహుబలి' సినిమా కథలో లేని 40 కొత్త పాత్రలను ఈ టీవీ సిరీస్ లో చూపించబోతున్నారు. ‘బహుబలి 2' రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత ఈటివి సిరీస్ ప్రసారం చేయడానికి రాజమౌళి ఇప్పటికే ఈటివి సిరీస్ చిత్రీకరణ విషయంలో కూడ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి' కథ ముగిసినా ఈ పేరు ఒక బ్రాండ్ గా కొనసాగించడానికి రాజమౌళి చేస్తున్న ఎన్నో ప్రయత్నాలలో ఇది ఒక ప్రయత్నం అని అంటున్నారు..

English summary
Ahead of the release of "Bahubali: The Conclusion", director S S Rajamouli today announced a mini TV series based on the prequel book trilogy 'The Rise of Sivagami'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu