ఆ టైమ్‌లో రాజమౌళి.. ఓకే అంటే వేరేలా ఉండేది.. ఆ బాధ వెంటాడుతూనే ఉంది: హీరోయిన్ ఆవేదన
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఏ అవకాశం ఎక్కడినుంచి తన్నుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఊహించని ఛాన్స్ దక్కి ఇట్టే స్టార్స్ అయినవాళ్లు ఉన్నారు.. అందివచ్చిన అవకాశాన్ని కాళ్ళ దన్నుకొని ఆ తర్వాత కెరీర్ గురించి బాధపడే వారు సినీ ఇండస్ట్రీలో. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తినే నేను అంటోంది హీరోయిన్ అర్చన. ఒకప్పుడు చేసిన తప్పు తలచుకొని తెగ ఫీల్ అవుతోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి? అర్చన అంతలా ఎందుకు బాధపడుతోంది? వివరాల్లోకి పోతే..

అందంతో పాటు టాలెంట్ ఉంది కానీ..
హీరోయిన్ అర్చన.. స్టార్ హీరోయిన్ కానప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితం ఈ బ్యూటీ. చాలా సినిమాల్లో నటించి అందంతో పాటు తనలో టాలెంట్ కూడా ఉందని నిరూపించుకుంది అర్చన. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి పేర్కొంటూ ఆవేదన చెందింది.

రాజమౌళి అడిగారు.. ఆ టైమ్‌లో!!
తనకు మగధీర సినిమాలో రాజమౌళి గారు ఛాన్స్ ఇచ్చారని, సలోని పాత్ర కోసం ముందుగా తననే సంప్రదించారని చెప్పింది అర్చన. అయితే ఆ సమయంలో తాను కాస్త బిజీగానే ఉన్న కారణంగా రిజెక్ట్ చేశానని ఆమె తెలిపింది. అప్పటికే తాను నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి సినిమా హిట్ అయ్యాయని, తన జర్నీ సాఫీగా ఉందని చెప్పుకొచ్చింది అర్చన.

సంబరపడ్డా.. కానీ చివరకు
వేద అంటూ నా గురించి మాట్లాడుకునే రోజులని, అది చూసి తాను చాలా సంబరపడే దాన్ని అని అర్చన చెప్పింది. కానీ ఆ తర్వాత తాను లీడ్ రోల్స్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, సైడ్ రోల్స్ చేస్తే అవి హిట్ అయ్యాయని అర్చన తెలిపింది. అప్పుడనిపించింది రాజమౌళి ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ ఎందుకు చేశానా? అని.. చెబుతూ ఫీల్ అయింది అర్చన.

అది మాత్రం రివీల్ చేయలేదు.. ఒకవేళ ఒప్పుకుంటేనా!
అంతేకాదు ఆ తర్వాత కూడా మంచి డైరెక్టర్‌తో హీరోయిన్‌గా తనకు పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని, కానీ అప్పుడు తాను ఉన్న పరిస్థితిలో రిజెక్ట్ చేయడంతో.. తన బదులుగా వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని, ఆ మూవీ పెద్ద హిట్ అయ్యిందని అర్చన చెప్పింది. అయితే ఆ సినిమా ఏంటి? దర్శకుడు ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

రాజమౌళికి క్షమాపణలు.. తెగ ఫీలైన అర్చన
అలా మంచి ఛాన్సులు పోగొట్టుకున్నానని చెబుతూ ఆవేదన చెందింది అర్చన.
మంచి సమయంలో అంత పెద్ద దర్శకుడ్ని ఎందుకు వదిలేశానా? అని ఇప్పుడనిపిస్తోందని అర్చన చెప్పింది. యమదొంగ సినిమా లోని పాట కోసం రాజమౌళి సార్ తో పనిచేశానని, ఆ టైమ్ లో ఆయనకు క్షమాపణలు చెప్పాలనిపించిందని పేర్కొంటూ అర్చన తెగ ఫీల్ అయింది.
Recommended Video


టాలీవుడ్ అగ్ర దర్శకుడు.. ఆ క్రెడిట్ అంతా!
ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం తన RRR ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా పేరుగాంచారు జక్కన్న.


Click it and Unblock the Notifications











