రాజమౌళి శిష్యులా అమ్మో..అంటూ పరార్

By Srikanya

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి శిష్యులు ముగ్గురు ఈ 2009 లో దర్శకులుగా పరిచయమయ్యారు. ఆయన శిష్యులు అవటంతో డైరక్టర్స్ గా అవకాశాలు పట్టడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం వారికి రాలేదు. కానీ ఆ ముగ్గురులో ఎవరూ కూడా మినిమం యావరేజి రేంజి సినిమా కూడా ఇవ్వలేకపోయారు. ముందుగా నితిన్, ప్రియమణి కాంబినేషన్ లో కరుణ కుమార్ అనే శిష్యుడు ద్రోణ చిత్రాన్ని రూపొందించాడు. అందులో ప్రియమణి కష్టపడి ఎక్సపోజింగ్ చేస్తూ బికినీ వేసి అందాలను ఆరపోసినా ఫలితం లేకుండా పోయింది. క పురాతనమైన కథ, నీరసమైన కథన ఆ సినిమాను నీరు గార్చేసారు. ఆ తర్వాత రాజమౌళి తండ్రి కథతో బాలకృష్ణ,ప్రియమణి కాంబినేషన్లో మహదేవన్ అనే మరో శిష్యుడు మిత్రుడు అనే సినిమా తో వచ్చాడు. ఆ చిత్రం కథ చాలా పాతది కావటం,బాలకృష్ణ వంటి స్టార్ ని అలాంటి కాథలో చూడలేకపోవటంతోఆ చిత్రమూ ఏ వర్గాన్నీ ఆకట్టుకోక ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత లేటెస్టుగా రాజమౌళి ప్రియశిష్యుడు కన్నన్..అజయ్ ని హీరోగా చూపిస్తూ సారాయి వీర్రాజు అంటూ వచ్చాడు. విపరీతమైన తమిళ వాసనలు, పస లేని కధ, స్క్రీన్ ప్లే ఈ చిత్రాన్ని ప్రేక్షకులుకు సహన పరీక్షగా మార్చేసాయి. దాంతో ఈ పరాజయాలు మూడూ రాజమౌళి శిష్యులవే కావటంతో మినగిలిన వారు కథలు పట్టుకొచ్చినా రాజమౌళి బ్రాండ్ నేమ్ చూసి ఆఫర్స్ ఇవ్వకూడదని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X