twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి అంచనా నిజమైంది

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఆస్కార్ అవార్డుల విషయంలో వేసిన అంచనా నిజమైంది. ఆయన గతంలో హాలీవుడ్ స్పేస్ థ్రిల్లర్ గ్రావిటీ గురించి బ్రిలియంట్ ఫ్లిక్ అని ట్వీట్ చేసారు. అలాగే దర్శకుడు కావాలనుకుంటున్న ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన చిత్రం అని చెప్పారు. కొన్ని స్లోగా ఉన్నా క్లైమాక్స్ అద్బుతంగా ఉంది. ,సౌండ్స్, విజువల్స్ చాలా టాప్ నెక్ ఉందని అన్నారు. ఇప్పుడదే నిజమైంది. ఈ చిత్రం ఆస్కార్ లో ఏడు అవార్డులు సాధించింది.

    లాస్‌ఏంజెలిస్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) వైభవంగా జరిగిన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో 'గ్రావిటీ' చిత్రం ఏడు అవార్డులు అందుకుంది. ఉత్తమ నటుడిగా స్టీవ్‌ మెక్‌కొనావ్‌గె (డల్లాస్‌ బయ్యర్స్‌ క్లబ్‌), ఉత్తమ నటిగా కేట్‌ బ్లాన్‌చెట్‌ (బ్లూ జాస్మిన్‌) , ఉత్తమ దర్శకుడిగా అల్ఫాన్సో క్యూరోన్‌ (గ్రావిటీ) ఎంపికయ్యారు.

    S.S Rajamouli 's prediction is perfect!

    చిత్రం కథేమిటంటే.... అంతరిక్షయానానికి వెళ్లిన ముగ్గురు వ్యోమగాముల్లో ఇద్దరు ఓ ప్రమాదంలో మరణిస్తారు. మిగిలిన రియాన్‌ అనే మహిళా వ్యోమగామి తిరిగి భూమికి ఎలా చేరిందనేదే చిత్రకథాంశం. వ్యోమగామి రియాన్‌గా సాండ్రా బుల్లాక్‌ కనిపించింది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో భవిష్యత్తును కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు అల్ఫాన్సో క్వురోన్‌. సంచలన చిత్రాలను రూపొందించిన వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థచే ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించబడిన భారీ అంతరిక్ష సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం గ్రావిటీ'. జార్జ్‌ క్లోనీ, సాండా బుల్లోక్‌ వంటి స్టార్లు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

    అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నేపధ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆల్‌ఫోన్సో కారోన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోసం ఆల్‌ ఫోన్సో సుమారు నాలుగున్నర సంవ త్సరాలు శ్రమించారు. ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రానికి సంబంధించి వినియో గించిన టెక్నాలజీ ప్రతి ఒక్కరిని మంత్రముగ్గులను చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తలెత్తే పలు సమస్యలను ఇద్దరు వ్యోమగామలు ఎలా అధిగమించగలిగారు అనే అంశాలను దర్శకుడు అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స అనుభూతులతో చూపించటం జరిగింది. ఈ 3డీ స్పేస్‌ థ్రిల్లర్‌ మీకు ఆకాశంలో ఉన్న అనుభూతులను చేరువ చేసింది.

    English summary
    At the time of Gravity release in India, Rajamouli hailed it as a brilliant flick which every wannabe director should watch. He stated that though the flick is slow at times including at climax, the sound and visuals are of top notch. Like the way Rajamouli said, Gravity has won 7 Oscar awards at the 86th Academy Awards function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X